Srinidhi Shetty: ఆదర్శ కుటుంబం నుంచి శ్రీనిధి శెట్టి ‘స్వర్ణ’ గ్లింప్స్ రిలీజ్

Swarna holding AK 47 rifle

విక్టరీ వెంకటేష్ దగ్గుబాటి, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబం చిత్రం నుంచి శ్రీనిధి శెట్టి ‘స్వర్ణ’ పాత్ర గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్రచారం దూసుకుపోతోంది.

Family Drama Swarna Glimpse Goes Viral

‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47’ (AK47) నుంచి శ్రీనిధి శెట్టి పాత్రను పరిచయం చేస్తూ వచ్చిన వీడియో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. ఈ ఆడాళ్లకి ఆటీట్యూడ్ తప్ప గ్రాటీట్యూడ్ ఉండదనే త్రివిక్రమ్ మార్క్ డైలాగ్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. రోజుకో కొత్త వీడియోతో ప్రచారాన్ని హైప్ చేస్తున్న మేకర్స్ నుంచి ఇదే లేటెస్ట్ అప్డేట్.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లో ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ మూవీలో నారా రోహిత్, నివేతా పేతురాజ్, రావు రమేష్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ అక్టోబర్ 2, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

పెద్ద బడ్జెట్‌లో తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ డ్రామా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శ్రీనిధి శెట్టి పాత్రకు వస్తున్న ఈ రెస్పాన్స్ మూవీపై హైప్‌ని మరింత పెంచింది. ఇప్పటికే విడుదలైన టీజర్‌లు కూడా బాగా వైరల్ అయ్యాయి.

https://x.com/pakkafilmy007/status/1600352362639822848

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu