సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా దర్శకుడు రాజమౌళి రూపొందిస్తున్న ఎస్ఎస్ఎంబీ 29 సినిమా కొత్త షెడ్యూల్ ప్లానింగ్ లో ఉంది. ఈ సినిమాకు సంబంధించి ఒడిశా, హైదరాబాద్ లో రెండు షెడ్యూల్స్ ఇప్పటికే పూర్తయ్యాయి. మూడో షెడ్యూల్ కోసం ఆఫ్రికా వెళ్లాల్సిఉండగా..కెన్యాలో జరుగుతున్న గొడవలతో వాయిదా వేశారు. ఇప్పుడీ షెడ్యూల్ నే ఆఫ్రికాలోని టాంజానియాలో షూటింగ్ చేయబోతున్నారు.
ఇందుకోసం అక్కడ లొకేషన్ సెర్చింగ్ లో మూవీ టీమ్ ఉంది. వచ్చే నెల సెకండ్ వీక్ నుంచి ఎస్ఎస్ఎంబీ 29 టీమ్ ఆఫ్రికా షూటింగ్ కు వెళ్లనుంది. ఇక్కడ పలు భారీ యాక్షన్ సీక్వెన్సులను రూపొందిస్తారట. ఈ మూవీలో ప్రియాంక చోప్రా హీరోయన్ గా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ మరో కీ రోల్ చేస్తున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్ లో కే ఎల్ నారాయణ నిర్మిస్తున్న ఎస్ఎస్ఎంబీ 29 టాలీవుడ్ నుంచి వస్తున్న మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కానుంది.





