Sumanth: విడాకుల తర్వాతా మాజీ భార్యతో స్నేహం.. నిజం చెప్పిన హీరో

Suman image at 1024x576

తెలుగు ఇండస్ట్రీలో తనదైన మార్క్ చేసుకున్న హీరో సుమంత్.. అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చినా, కమర్షియల్ సినిమాల కంటే కంటెంట్ బేస్డ్ మూవీస్ ఎంచుకుని ఫ్యాన్స్ మనసు గెలిచారు. ‘సత్యం’, ‘గోదావరి’, ‘గోల్కొండ హైస్కూల్’ లాంటి సినిమాలతో తన నటన చూపించిన సుమంత్, ఇప్పుడు ‘మహేంద్రగిరి వారాహి’తో రెడీ అవుతున్నారు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన మాజీ భార్య, డైవోర్స్, మళ్లీ పెళ్లి గురించిన కామెంట్స్ మళ్లీ వైరల్ అవుతున్నాయి.

Sumanth on ex-wife friendship

విడాకులు తీసుకున్న తర్వాత చాలామంది దంపతులు ఒకరికొకరు దూరమవ్వడం మామూలే. కానీ సుమంత్ విషయంలో అది పూర్తిగా రివర్స్ అంటున్నారు. కీర్తి రెడ్డితో చట్టపరంగా సెపరేట్ అయినా, వాళ్ళ మధ్య ఎలాంటి విరోధం లేదు. ఇప్పటికీ మంచి ఫ్రెండ్స్ లాగా ఉంటున్నామని, ఆమె ఫ్యామిలీతో కూడా తనకు కనెక్షన్ ఉందని చెప్పారు. ఇద్దరం పరస్పరం గౌరవంతో టచ్లో ఉన్నామని క్లారిటీ ఇచ్చారు. ఇలా ఎలా మెయింటెయిన్ చేస్తున్నారని అడిగితే, మనమిద్దరం గుడ్ పర్సన్స్ అని, జీవితంలో జరిగిన వాటిని అక్సెప్ట్ చేశామని, ఒకరినొకరు ఫర్గివ్ చేసుకున్నామని చెప్పారు.

పెళ్లి సమయంలో తమకు తగినంత మెచ్యూరిటీ లేదని సుమంత్ ఒప్పుకున్నారు. ఎలాంటి గొడవలు లేవు, ఇతర ప్రాబ్లమ్స్ లేవు అని స్పష్టం చేశారు. జీవితాన్ని అర్థం చేసుకునే టైంలో మ్యాచ్ అవ్వకపోవడమే కారణం. గతాన్ని పట్టుకుని కూర్చోకుండా, మూవ్ ఆన్ అవ్వాలని డిసైడ్ అయ్యామని అన్నారు. ప్రస్తుతం సింగిల్ లైఫ్ చాలా ఎంజాయ్ చేస్తున్నానని, మళ్లీ పెళ్లి చేసుకునే ప్లాన్ ఏమీ లేదని కూడా క్లియర్ చేశారు.

మొత్తానికి సుమంత్ తన వ్యక్తిగత లైఫ్ గురించి ఓపెన్ గా మాట్లాడటం ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ లాగా ఉంది. నిజాయితీగా స్పందించడాన్ని అందరూ అభినందిస్తున్నారు. ఈ ఇంటర్వ్యూ క్లిప్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

https://x.com/pakkafilmy007/status/1600352362639822848

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu