Air Coolers : వేసవికాలంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి. దీంతో ప్రతి ఒక్కరూ ఏసీ లేదా కూలర్లని కొనుగోలు చేయాలని చూస్తూ ఉంటారు. అయితే వేసవికాలంలో కూల్ కూల్ కూలర్స్ కొన్ని ఉన్నాయి. తక్కువ ధరలోనే బెస్ట్ ఫీచర్స్ ఉన్న కూలర్లకి సంబంధించిన వివరాలను చూసేద్దాము.. ఇండియాలో చాలామంది ఎండ నుండి రక్షణ ని పొందాలని తక్కువ ఖర్చుతో అయిపోతుందని కూలర్లని కొంటూ ఉంటారు. ప్రముఖ ఎయిర్ కూలర్ బ్రాండ్ల ప్రకారం సగటు కూలర్ గంటకి 150 నుండి 300 వాట్ల శక్తిని వినియోగిస్తుంది యేసుతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ ఏసీలు ప్రస్తుతం కూలర్లతో పోలిస్తే అధిక ధరల్లో ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉండేలా ఉన్న టాప్ కూలర్ల గురించి చూద్దాం.

Air Coolers in less price

సింఫనీ డైట్ 12 టీ కి విషయానికి వస్తే.. సింఫనీ డైట్ 12టీ పర్సనల్ టవర్ ఎయిర్ కూలర్ ఫర్ హోమ్ తక్కువ ధరకే వినియోగదారుడికి అందుబాటులో ఉంటుంది. సింఫనీ హౌస్ నుంచి అధిక-నాణ్యత వున్నా ఈ ఎయిర్ కూలర్ వచ్చింది వేడి, తేమతో కూడిన వేసవి కాలంలో చల్లగా ఉండేలా చేస్తుంది. సింఫనీ ఎయిర్ కూలర్ 3-సైడ్ హనీకోంబ్ ప్యాడ్‌లతో వస్తుంది. హెవీ-డ్యూటీ 170 వాట్ మోటార్‌తో నడిచే శక్తివంతమైన బ్లోవర్‌తో ని ఇచ్చారు.

Also read: Harish Rao: కాంగ్రెస్ మాటలు ఆకాశంలో.. చేతలు పాతాళంలో..!

అలానే బజాజ్ డీఎంహెచ్ నియో 65 ఎల్ డెసర్ట్ ఎయిర్ కూలర్ కూడా బావుంది. సూపర్ ఫీచర్స్‌తో వస్తుంది ఇది కూడా. బజాజ్ హౌస్ ఎయిర్ కూలర్ కూడా గది మొత్తం ని కొన్ని సెకన్లలో చల్లగా ఉండేలా చేస్తుంది. 65 లీటర్ల వాటర్ ట్యాంక్ లోపల ఉన్న ప్యాడింగ్‌లోని ప్రతి మూలకు నీటిని పంప్ చేసేస్తుంది. తద్వారా కూలర్ నుండి వచ్చే గాలి చల్లగా ఉంటుంది (Air Coolers).

Join WhatsApp