Realme launches Narzo 70 series smartphones in India

Realme Narzo 70 5G Series: మన ఇండియన్ మార్కెట్లో అనేక రకాల మొబైల్ ఫోన్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఇంకా ఇంకా కొత్త కొత్త ఫోన్లు వస్తూనే ఉన్నాయి. మంచి ఫీచర్లు ఉన్న ఫోన్లు ఎక్కువగా రిలీజ్ చేస్తున్నాయి కంపెనీలు. మంచి ఫీచర్లతో పాటు తక్కువ ధరలో ఉన్న మొబైల్ ఫోన్లను జనాలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీంతో అలా కూడా కొన్ని ఫోన్లను తీసుకువస్తున్నాయి కంపెనీలు. ఇలా ఏదో ఒక సాకుతో కొత్త కొత్త మొబైల్లు… ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ అవుతూనే ఉన్నాయి. Realme Narzo 70 5G Series

Realme launches Narzo 70 series smartphones in India

అయితే తాజాగా రియల్ మీ కంపెనీ నుంచి సరికొత్త మొబైల్ ఫోన్స్ వచ్చేసాయి. ఒకేరోజు రెండు ఫోన్లను రిలీజ్ చేసింది రియల్ మీ కంపెనీ. రియల్ మీ నార్జో 70 5జి, అలాగే రియల్ మీ నార్జో 70 ఎక్స్ 5జి ఫోన్ లను తాజాగా రిలీజ్ చేసింది రియల్ మీ కంపెనీ. ఈ రెండు ఫోన్లు మన ఇండియాలో లాంచ్ అయ్యాయి. మరి కొత్తగా రిలీజ్ అయిన ఈ మొబైల్ ఫోన్లో గురించి ఇప్పుడు తెలుసుకుందాం. Realme Narzo 70 5G Series

Also Read: Best Refrigerators: సామాన్య కుటుంబాల కోసం అదిరిపోయే రిఫ్రిజిరేటర్లు.. ధర రూ. 15వేల కన్నా తక్కువే..!

రియల్ మీ నార్జో డెబ్భై 5జి మొబైల్ గురించి మొదటగా తెలుసుకున్నట్లయితే…. 6gb ర్యామ్ మరియు 128 జీబీ స్టోరేజ్ ఉన్న ఫోన్ 15వేల రూపాయలుగా ఫిక్స్ చేశారు. అంతేకాకుండా 8gb ర్యామ్ మరియు 128 జీబీ స్టోరీ ఉన్న ఫోను 16,000 రూపాయలుగా సెట్ చేశారు. అంతేకాకుండా రియల్ మీ నార్జో 70 ఎక్స్ 5జి మొబైల్ ధర విషయానికి వస్తే… ఇందులో నాలుగు జీబీ మరియు 128 జీబీ స్టోరేజ్ ఉన్న మోడల్ పదకొండు వేల రూపాయలు ఉంది. అంతేకాకుండా ఆర్జీబీ ర్యామ్ మరియు 128 జిబి స్టోరేజ్ ఉన్న ఫోన్… 12 వేల రూపాయలు గా ఫిక్స్ చేశారు. Realme Narzo 70 5G Series

ఇక ఈ మొబైల్ ఫోన్లు నిన్నటి నుంచే మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. ఈ రెండు ఫోన్లు గ్రీన్ మరియు ఐస్ బ్లూ కలర్స్ లో లభిస్తున్నాయి. ఈ రెండు ఫోన్ల బ్యాటరీ సామర్థ్యం 5000 mah గా ఉందని కంపెనీ వెల్లడించండి. అలాగే ఈ రెండు ఫోన్ల కెమెరాలు కూడా చాలా బాగా ఇచ్చారు. ఈ రెండు ఫోన్లు 108 గ్రాముల బరువు ఉంటాయని కంపెనీ వెల్లడించింది. అంతేకాకుండా 6.7 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంటాయి మొబైల్ ఫోన్స్.Realme Narzo 70 5G Series

Join WhatsApp