Harish Rao who is eyeing the CM's seat

Harish Rao: ప్రజల సమస్యలని ఎజెండాగా కాంగ్రెస్ బిజెపి మోసాలను ఎండగడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో కొట్లాడుదామని మాజీ మంత్రి సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. అలానే హరీష్ రావు మాట్లాడుతూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. మహబూబ్నగర్ జిల్లా తొర్రూరు మండలం కేంద్రం లో పిఎస్ఆర్ స్కూల్ మైదానంలో పాలకుర్తి నియోజకవర్గం వరంగల్ పార్లమెంట్ ఎన్నికల సమావేశంలో హరీష్ రావు మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో చాలా స్థానాలలో స్వల్ప మెజారిటీ తేడాలో కాంగ్రెస్ విజయాన్ని అందుకుందని అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మీద 100 రోజుల్లోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని అన్నారు.

Harish Rao comments on Congress

పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి విజయ అవకాశాలు మెండుగా ఉన్నాయని అన్నారు కాంగ్రెస్ మోసపు హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. రాష్ట్రంలో ఎనిమిది నుండి పది స్థానాలలో బీఆర్ఎస్ గెలిచే ఛాన్స్ ఉందని పలు సర్వేలు చెప్తున్నాయని అన్నారు కొందరు స్వార్ధపరులు స్వార్థ ప్రయోజనాల కోసం లబ్ధి పొందిన నాయకులు పార్టీని విడిచిపెట్టి వెళ్తున్నారని అరచేతిలో వైకుంఠం చూపించే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని హరీష్ రావు అన్నారు. 60 ఏళ్లుగా జరగని అభివృద్ధి గత పదేళ్లలో అన్ని రంగాల్లో మన పాలకుర్తి నియోజకవర్గం అభివృద్ధి చెందిందని ఐదేళ్లలో 4200 కోట్లతో పాలకుర్తి నియోజకవర్గం లో అభివృద్ధి పనుల సంక్షేమ కార్యక్రమాలు చేశామని అన్నారు.

Also read: Naga Chaithanya: ఏంటి ఆ బాలీవుడ్ హీరోయిన్ కి నాగచైతన్య అన్నయ్య అవుతాడా..?

కాంగ్రెస్ పాలనలో బస్సు మినహా అంతా తుస్సే. ఏమైంది మీ హామీలు ఏమైంది మేనిఫెస్టోలో ఇచ్చిన పథకాలు అసలు వస్తాయా అన్న సందేహం ప్రజల్లో వచ్చేసిందని రాష్ట్రంలో కాంగ్రెస్ ని తుక్కుతుక్కుగా ఓడిస్తారని దేవుడి మీద ప్రమాణాలు చేస్తున్నారన్నారు మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్ అబద్ధాలు ఊరంతా చుట్టి వచ్చాయని నిజం మాత్రం గడప కూడా దాటలేదని చెప్పుకోవడంలో మనం విఫలం చెందాము. కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టేందుకు ప్రజలు మే 13 కోసం ఎదురు చూస్తున్నారని హరీష్ రావు అన్నారు (Harish Rao).

Harish Rao who is eyeing the CM's seat
Join WhatsApp