moto buds and buds+ launched in India

Moto earbuds: మన ఇండియన్ మార్కెట్లో అనేక రకాల స్మార్ట్ ఫోన్స్ ఉన్న సంగతి తెలిసిందే. మొబైల్ ఫోన్లతో పాటు… మొబైల్ కు సంబంధించిన చాలా రకాల గాడ్జెట్స్ కూడా ఉంటాయి. మొబైల్ చార్జర్, ఇయర్ ఫోన్స్, పౌచ్ ఇలా ఎన్నో రకాల గాడ్జెట్స్ మనకు మార్కెట్లో లభిస్తాయి. మొబైల్ ఫోన్ ఒక్కటే కొంటే సరిపోదు.. కచ్చితంగా పైవన్నీ కొనాల్సిందే. ప్రస్తుత కాలంలో పైవన్నీ కొనకపోతే మనం ఫోన్ వాడలేము. Moto earbuds

moto buds and buds+ launched in India

ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చాలామంది ఇయర్ బడ్స్ వాడుతున్నారు. రకరకాల ఇయర్ బర్డ్స్ వస్తున్నాయి. తక్కువ ధరలో కూడా మార్కెట్లోకి లాంచ్ చేస్తున్నాయి కంపెనీ. అయితే తాజాగా మోటో కంపెనీ నుంచి రెండు కొత్త ఇయర్ బడ్స్ మార్కెట్లోకి లాంచ్ అయ్యాయి. ఇప్పుడు వాటి వివరాలు తెలుసుకుందాం. Moto earbuds

Also Read: OnePlus Nord CE 4 Lite: బడ్జెట్‌ ధరలోనే వన్‌ప్లస్‌ ఫోన్‌..!

మోటో బడ్స్, మరియు మోటో బడ్స్+ పేరుతో రెండు కొత్త మోడల్స్ మార్కెట్ లోకి వచ్చేసాయి. 50 డేసి బేల్స్, మరియు 46 డేసి బేల్స్ యాక్టివ్ నైస్ క్యాన్సిలేషన్ కు ఈ రెండు సపోర్ట్ చేస్తాయి. ఇక మోటో బడ్స్ ధర 5000 రూపాయలుగా ఫిక్స్ చేశారు. ఏదైనా క్రెడిట్ కార్డు ద్వారా వీటిని కొనుగోలు చేస్తే 1000 రూపాయల డిస్కౌంట్ వస్తుంది. ఇక పది నిమిషాల్లోనే… రెండు గంటలకు వాడుకునే ఛార్జింగ్ ఎక్కుతుంది. అలాగే ఒకసారి ఫుల్ చార్జింగ్ పెడితే ఇవి 42 గంటల పాటు వాడుకోవచ్చు. Moto earbuds

మోటో బడ్స్ ప్లస్ ధర పదివేల రూపాయలుగా ఫిక్స్ చేశారు. వీటిని ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే 2000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. ఇక వీటిని ఒక్కసారి ఫుల్ చార్జింగ్ ఎక్కిస్తే 38 గంటల పాటు వాడుకోవచ్చు. అలాగే పది నిమిషాల ఛార్జింగ్ ఎక్కితే మూడు గంటల పాటు వీటిని మనం శుభ్రంగా వాడొచ్చు. ఈ రెండిటిని ఆన్లైన్లో కొనుగోలు చేసేందుకు మోటో సదుపాయాలు కల్పించింది. Moto earbuds

Join WhatsApp