Lenovo tab k11 : ఈరోజుల్లో మార్కెట్లో వున్నా ట్యాబ్లెట్స్‌కు డిమాండ్‌ బాగా పెరుగుతోంది. చాలా మంది గేమ్‌ లవర్స్‌, మూవీ లవర్స్‌ ల్యాప్‌టాప్‌ కి బదులుగా ట్యాబ్లెట్స్‌ను కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ క్రమం లోనే ప్రముఖ కంపెనీలన్నీ వరుసగా ట్యాబ్లెట్స్‌ను లాంచ్‌ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం లెనొవో మార్కెట్లోకి కొత్త ట్యాబ్‌ను తీసుకుని రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు లోకి వెళ్ళిపోదాం. ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం లెనోవో భారత మార్కెట్లోకి తాజాగా కొత్త ట్యాబ్‌ను తీసుకు వచ్చింది. లెనోవో ట్యాబ్‌ కే11 పేరుతో తీసుకొచ్చిన ఈ ట్యాబ్‌ను మిడ్ రేంజ్‌ బడ్జెట్‌ లో లాంచ్‌ చేయడం జరిగింది.

Lenovo tab k11 full details

లెనోవో ట్యాబ్‌ కే11లో మీడియాటెక్ హెలియో జీ88 ఎస్వోసీ చిప్ సెట్ ప్రాసెసర్‌ను ఇచ్చారు. 8జీబీ ర్యామ్, 128 జీబీ ఆన్ బోర్డు స్టోరేజీ తో దీన్ని తీసుకొచ్చారు. డోల్బీ ఆట్మోస్ టెక్నాలజీతో క్వాడ్ స్పీకర్లు కూడా ఇచ్చారు. 7040 ఎంఏహెచ్ కెపాసిటీ వున్నా బ్యాటరీని అందించారు. 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.17,990గా వుంది. 8జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర వచ్చేసి రూ.19,990గా వుంది. లునా గ్రే, సీఫోమ్ గ్రీన్ కలర్ ఆప్షన్స్‌ లో దీన్ని తీసుకు వచ్చారు.

Also read: Chiranjeevi: చిరంజీవితో రొమా** ఏం బాలేదు.. నేను మూవీ చేయానని వెళ్లిపోయిన స్టార్ హీరోయిన్..?

ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో ఈ ట్యాబ్‌ వర్క్ అవుతుంది. కే11 ట్యాబ్‌లో 10.95 ఇంచెస్‌ తో కూడిన ఎల్‌సీడీ స్క్రీన్‌ను ఇచ్చారు. 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌, 1200×1920 పిక్సెల్స్ ఇచ్చారు. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 10 గంటల వీడియో ప్లే బ్యాక్‌ ఇస్తుందని కంపెనీ అంటోంది. 13 మెగా పిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8 మెగా పిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు (Lenovo tab k11).

Join WhatsApp