
Telangana: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఛైర్మన్ పదవులపై కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ తరుణంలో ఆమనగల్ మున్సిపాలిటీలో బీజేపీ కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. స్పష్టమైన మెజారిటీ సాధించిన బీఆర్ఎస్ పార్టీకి చైర్మన్ పదవి దక్కకుండా కుట్రలకు తెరలేపినట్లు గులాబీ పార్టీ నేతలు వార్తలు వైరల్ చేస్తున్నారు.Telangana
Telangana BJP-Congress alliance in Amanagal Municipality
కేవలం ఒక్క వార్డు వచ్చిన కాంగ్రెస్ పార్టీకి చైర్మన్ ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మున్సిపాలిటీలో 15 వార్డులకు గాను 8 వార్డులు బీఆర్ఎస్ గెలుచుకుంది. ఒక్క వార్డు కాంగ్రెస్, 6 వార్డులు బీజేపీ దక్కించుకుంది. బీఆర్ఎస్ పార్టీకి చైర్మన్ పదవి దక్కకుండా కుట్రలు చేస్తున్నారట బీజేపీ, కాంగ్రెస్ నాయకులు. Telangana
Also Read: Telangana: ఎన్నికల్లో ఓడిపోయినందుకు పంచిన డబ్బులు తిరిగి ఇవ్వాలని కాంగ్రెస్ అభ్యర్థి హల్చల్
కాంగ్రెస్ పార్టీకి తమ కౌన్సిలర్లను ఇచ్చి, చైర్మన్ పదవి కట్టబెట్టి, వైస్ చైర్మన్ పదవితో సరిపెట్టుకునే ఆలోచనలో బీజేపీ నాయకులు ఉన్నార. కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ వచ్చేందుకు తమ ఎక్స్ అఫిషియో ఓట్లు నమోదు చేసుకోనున్నారట కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి. దీంతో ఆమనగల్ మున్సిపాలిటీలో బీజేపీ కాంగ్రెస్ పొత్తుతో ఛైర్మన్ పదవి దక్కే అయ్యే అవకాశం ఉంది. Telangana
Also Read: Congress: మున్సిపల్ ఎన్నికలు.. కాంగ్రెస్ మరో కొత్త కుట్ర, బయటపెట్టిన కోనేరు కోనప్ప ?





Kushbu Sundar: నైనార్ నాగేంద్రన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన కుష్బూ