Telangana: ఎన్నికల్లో ఓడిపోయినందుకు పంచిన డబ్బులు తిరిగి ఇవ్వాలని కాంగ్రెస్ అభ్యర్థి హల్చల్

Telangana
Telangana
Telangana

Telangana: తెలంగాణ రాష్ట్రంలో మున్నిప‌ల్ ఎన్నిక‌లు ముగిసిన నేప‌థ్యంలో అనేక సిత్రాలు తెర‌పైకి వ‌స్తున్నాయి. ఎన్నికల్లో ఓడిపోయినందుకు పంచిన డబ్బులు తిరిగి ఇవ్వాల‌ని ఓడిన నేత‌లు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల్లో ఓడిపోయినందుకు పంచిన డబ్బులు, చీరలు ,హాట్ బాక్స్‌లను తిరిగి ఇవ్వాలని కాంగ్రెస్ అభ్యర్థి హల్చల్ చేసిన సంఘ‌ట‌న వైర‌ల్ గా మారింది. Telangana

Telangana Congress candidate demands return of money, sarees, hot boxes distributed for losing election

యాదాద్రి భువనగిరి మున్సిపాలిటీలోని ఎన్నికల్లో ఒకటవ వార్డులో ఓడిపోయినందుకు తాను పంచిన డబ్బులు, చీరలు ,హాట్ బాక్స్‌లను తిరిగి ఇవ్వాలని ర‌చ్చ చేశారు. ఓటర్ల ఇళ్లపైకి వెళ్ళి హల్చల్ చేశార‌ట‌ కాంగ్రెస్ అభ్యర్థి స్వరూపరాణి, ఆమె కుటుంబ సభ్యులు. Telangana

Also Read: BRS: కేసీఆర్ సీక్రెట్ ఏజెంట్ గా గూడెం మహిపాల్ రెడ్డి..బీఆర్ఎస్ చేతిలోకి 5 మున్సిపాలిటీలు…

అయితే, కాంగ్రెస్ అభ్యర్థి స్వరూపరాణి, ఆమె కుటుంబ సభ్యులపైకి ఓటర్లు ఎదురు తిరిగారు. ఓటర్లు అందరూ ముకుమ్ముడిగా ఎదిరించడంతో, సమాధానం చెప్పలేక అక్కడి నుంచి వెళ్లిపోయారు స్వరూపరాణి. ఈ సంఘ‌ట‌న ఇప్పుడు వైర‌ల్ గా మారింది. Telangana

Also Read: BRS: మున్సిప‌ల్ ఎన్నిక‌లు..బీఆర్ఎస్ ఓటు షేర్ డ‌బుల్..ఎంతంటే ?