
హైదరాబాద్‌లోని జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ మంజీర హాస్టల్లో ఆహార నాణ్యతపై తీవ్ర దుమారం రేగుతోంది. సోమవారం రాత్రి వడ్డించిన సాంబార్లో నత్త కనిపించడంతో విద్యార్థులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. కొద్దిరోజుల క్రితమే చోలే మసాలా కూరలో బల్లి కనిపించిన ఘటన మరువకముందే, మళ్లీ ఇలాంటి అపరిశుభ్రత వెలుగుచూడటం హాస్టల్ విద్యార్థులను ఆందోళనకు గురిచేసింది.
JNTU Hyderabad Hostel Food Safety
ఉత్తర భారతదేశానికి చెందిన ఒక విద్యార్థి భోజనం చేస్తున్న సమయంలో సాంబార్ గిన్నెలో నత్తను గుర్తించినట్లు సమాచారం. ఈ విషయాన్ని మెస్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లగా, వారు మొదట అది నత్త కాదని బుకాయించే ప్రయత్నం చేసినట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. బాధితుడు గట్టిగా నిలదీయడంతో సిబ్బంది ఆ సాంబార్‌ను పారబోశారని, అప్పటికే కొందరు విద్యార్థులు ఆ ఆహారాన్ని భుజించారని తోటి విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న హాస్టల్ విద్యార్థులు పెద్ద ఎత్తున మెస్ వద్ద నిరసనకు దిగారు. యూనివర్సిటీ యంత్రాంగం నిర్లక్ష్యం వల్లే తమ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పది రోజుల క్రితం జరిగిన బల్లి ఘటనపై ఫిర్యాదు చేసినా, అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే మళ్లీ ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- Chandrababu Naidu: రేపు జరగనున్న ఏపీ మంత్రివర్గ సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ.. కీలక నిర్ణయాలు తీసుకోనున్న కేబినెట్?
- Revanth Reddy: కేసీఆర్ అప్పులపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు.. ఏమన్నారంటే
- Modi KCR Revanth: మోదీ, కేసీఆర్‌లపై రేవంత్ రెడ్డి యుద్ధం.. సునామీ గ్యారెంటీనా?
హాస్టల్ మెస్‌లలో పరిశుభ్రత ప్రమాణాలను పాటించడం లేదని, వంట గదుల్లో కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ సమస్యపై ఉన్నతాధికారులు స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఆహార నాణ్యతను నిరంతరం పర్యవేక్షించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. వర్సిటీ యాజమాన్యం ఈ వ్యవహారాన్ని ఏ విధంగా పరిష్కరిస్తుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ప్రశాంత్ – పక్కా ఫిల్మీ తెలుగు ఎడిటర్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, తెలుగు సినిమా, క్రీడలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే వార్తలను సులభమైన తెలుగులో అందిస్తారు. ప్రతి వార్త మా ఎడిటోరియల్ పాలసీ ప్రకారం సమాచారం సరిచూసిన తర్వాతే ప్రచురించబడుతుంది. ఫాలో అవ్వండి — X: https://x.com/pakkafilmy007 | Telegram: https://t.me/pakkafilmytelugu | Instagram: https://instagram.com/pakkafilmy_





