
Telangana elections: తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల నమోదు ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్రంలో మార్చి 2027లో పదవీకాలం ముగియనున్న రెండు కీలకమైన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానాల భర్తీ కోసం ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో అర్హులైన పట్టభద్రులు తమ పేర్లను ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి స్పష్టం చేశారు.
Telangana elections voter registration
మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ అలాగే వరంగల్ – ఖమ్మం – నల్గొండ నియోజకవర్గాల పరిధిలో ఈ ఓటర్ల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. సంబంధిత జిల్లాల యంత్రాంగాలు ఓటర్ల జాబితా రూపకల్పనకు సంబంధించిన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని ఎన్నికల సంఘం నుంచి స్పష్టమైన ఆదేశాలు అందాయి. నిర్ణీత గడువులోగా అర్హులందరూ తమ పేర్లను నమోదు చేసుకునేలా అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.
ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పట్టభద్రులందరూ ఫారమ్-18 ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. గతంలో ఓటర్లుగా ఉన్నప్పటికీ, కొత్త నిబంధనల ప్రకారం ప్రతిసారీ కొత్త జాబితా కోసం దరఖాస్తు చేసుకోవడం ం. డిగ్రీ లేదా తత్సమాన అర్హత కలిగి ఉండి, నిర్ణీత తేదీ నాటికి అర్హత సాధించిన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
ఓటర్ల నమోదు ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా చూడటానికి ప్రత్యేక సిబ్బందిని రంగంలోకి దించారు. దరఖాస్తుల పరిశీలన పూర్తియిన తర్వాత ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించి, అభ్యంతరాలను స్వీకరించనున్నారు. ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం తుది ఓటర్ల జాబితాను సిద్ధం చేసి తదుపరి ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది కాబట్టి అర్హులు త్వరపడాలి.
👉 ఇంకా చదవండి: Maoist attack: కాంగ్రెస్ నేతల ఊచకోత కేసులో 10 మందికి మరణశిక్ష!
ప్రశాంత్ – పక్కా ఫిల్మీ తెలుగు ఎడిటర్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, తెలుగు సినిమా, క్రీడలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే వార్తలను సులభమైన తెలుగులో అందిస్తారు. ప్రతి వార్త మా ఎడిటోరియల్ పాలసీ ప్రకారం సమాచారం సరిచూసిన తర్వాతే ప్రచురించబడుతుంది. ఫాలో అవ్వండి — X: https://x.com/pakkafilmy007 | Telegram: https://t.me/pakkafilmytelugu | Instagram: https://instagram.com/pakkafilmy_





