Telangana: 30 మంది ఎమ్మెల్యేలతో తెలంగాణ సీక్రెట్ మీటింగ్ ?

Telangana secret meeting with 30 MLAs

Telangana: తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం చుట్టూ రాజకీయాల కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మాగంటి గోపీనాథ్ మరణం నేపథ్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. నవంబర్ 11వ తేదీన జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో ఉప ఎన్నిక నిర్వహిస్తారు. Telangana

Telangana secret meeting with 30 MLAs

నవంబర్ 14వ తేదీన ఎలక్షన్ రిజల్ట్ ఉంటుంది. అయితే ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. అయితే దీనిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా అసంతృప్తిగా ఉన్నట్లు చెబుతున్నారు. తనకు మంత్రి పదవి ఇవ్వాలని మొత్తుకుంటుంటే, ఇప్పటివరకు దిక్కేలేదని ఫైర్ అవుతున్నారట. అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తున్నారు కానీ మరి నా సంగతేంటని నిలదీస్తున్నారట కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.Telangana

Also Read: Azharuddin: అజారుద్దీన్ కు మంత్రి పదవి..4 గురు కాంగ్రెస్ నాయకుల తిరుగుబాటు ?

ఇందులో భాగంగానే 30 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రహస్య సమావేశం నిర్వహించేందుకు ప్లాన్ చేసినట్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురించి సంచలన న్యూస్ బయట వైరల్ గా మారింది. అయితే ఈ న్యూస్ బయటకు రాగానే అదంతా ఫేక్ అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వర్గీయులు కొట్టి పారేశారు. గులాబీ పార్టీ సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలు వస్తాయని ఆయన వర్గీయులు వెల్లడించారట. Telangana

Also Read: Fenugreek Seeds: మెంతులు అని తీసిపారేస్తున్నారా..నీటిలో వేసుకొని తాగితే ?

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu