
నవంబర్ 21వ తేదీన అక్వాన్ తుపాను ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తూ ప్రజలు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Telangana Weather Alert Cyclone Forecast
ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, కొన్ని చోట్ల గాలి వేగం 70 కిలోమీటర్లకు కూడా చేరవచ్చని ఐఎండీ అంచనా వేసింది.
వీటితో పాటు ములుగు, నల్గొండ, జనగామ, యాదాద్రి భువనగిరి, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. రాష్ట్రవ్యాప్తంగా నవంబర్ 20 నుంచి 22 వరకు వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి:
- Entry: హైదరాబాద్ పార్కుల్లో పెరగనున్న టికెట్ ధరలు.. ఎంతంటే?
- Hyderabad Weather: వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే.. వర్షాల్లేవా?
- Telangana: 95 శాతం అటెండెన్స్ ఉంటేనే సెలవులు.. టీచర్ల నిరసన ఎందుకంటే?
మిగిలిన జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తుపాను తీవ్రతను బట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
చరిత్ర కథలు ఇష్టమా? మా తాజా హిస్టరీ వీడియో చూడండి: తూర్పు పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ ప్రయాణం
ప్రశాంత్ – పక్కా ఫిల్మీ తెలుగు ఎడిటర్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, తెలుగు సినిమా, క్రీడలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే వార్తలను సులభమైన తెలుగులో అందిస్తారు. ప్రతి వార్త మా ఎడిటోరియల్ పాలసీ ప్రకారం సమాచారం సరిచూసిన తర్వాతే ప్రచురించబడుతుంది. ఫాలో అవ్వండి — X: https://x.com/pakkafilmy007 | Telegram: https://t.me/pakkafilmytelugu | Instagram: https://instagram.com/pakkafilmy_





