
Nainika: ఢీ షో ద్వారా ఫేమస్ అయిన వారిలో నైనిక కూడా ఒకరు.ఈ ముద్దుగుమ్మ ఢీ షోలో తనదైనా డాన్స్ పెర్ఫార్మెన్స్ లతో జడ్జిలతో పాటు ఆడియన్స్ ని కూడా మెప్పించింది. అలా తన డ్యాన్స్ తో గుర్తింపు సంపాదించిన నైనిక బిగ్ బాస్ సీజన్ 8 లో కూడా హౌస్ లోకి వెళ్లే ఛాన్స్ అందుకుంది. అలా కొద్ది రోజులు హౌస్ లో కంటెస్టెంట్ గా రాణించిన నైనిక పర్ఫామెన్స్ బాగుండకపోవడంతో తొందర్లోనే హౌస్ నుండి ఎలిమినేట్ చేసేసారు ఆడియన్స్..
Nainika sensational comments on casting couch
అయితే అలాంటి నైనిక తాజాగా ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాకు తెలిసిన వ్యక్తి బ్రాండ్ ప్రమోషన్ అని చెబుతూనే పర్సనల్ రిక్వైర్మెంట్ అని అడిగాడు. పర్సనల్ రిక్వైర్మెంట్ అనే విషయాన్ని నొక్కి చెప్పడంతో నాకు అప్పుడు అతని లోపల ఉన్న ఇంటెన్షన్ అర్థమైంది. అంతేకాదు నాకు ఫోన్ చేసి నీ ఫోటోతో పాటు నీ రేటు కూడా బయటపడింది.. చాలా వైరల్ అవుతుంది అంటూ చాలా వల్గర్ గా మాట్లాడారు. (Nainika)
Also Read: Bollywood: బాలీవుడ్ జంటపై డైరెక్టర్ కామెంట్స్.. బట్టలిప్పి పడుకుంటారంటూ.!
అయితే ఆయన మాటలు నన్ను షాకింగ్ కి గురిచేసాయి. తెలిసినవాడని ఊరుకుంటే ఆయన చేసిన ఘనకార్యం ఇది.. ఇక ఇండస్ట్రీలో ఉండే వల్గారిటీ ఎంతలా పెరిగిపోయింది అంటే కొంతమంది నటీమణులు కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు ఇస్తారు అనే భ్రమలో ఉంటున్నారు. ఇలాంటి అమ్మాయిల వల్లే సినిమాల్లోకి వచ్చిన ప్రతి ఒక్కరిని కమిట్మెంట్ అడుగుతున్నారు. వీళ్లే అవకాశాల కోసం ముందుగా కమిట్మెంట్ ఇస్తే ఎలా..

ఇండస్ట్రీలో గలీజ్ పనులు ఎక్కువైపోయాయి.క్యాస్టింగ్ కౌచ్ చాలా వరకు పెరిగిపోయింది. నన్ను కూడా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చాలామంది నీకు పెద్ద సినిమాలో అవకాశం ఇస్తాం.. కమిట్మెంట్ ఇస్తావా అని ఓపెన్ గానే అడిగారు.కానీ నేను వాటికి ఒప్పుకోకపోవడంతో వాళ్లు సైలెంట్ అయిపోయారు.. అంటూ క్యాస్టింగ్ కౌచ్, కమిట్మెంట్ ల గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది నైనిక.(Nainika)


