Tirumala Rooms: తిరుమలలో భక్తులకు గదుల కేటాయింపు విధానంలో కీలక మార్పులు

తిరుమల వెళ్లే భక్తులకు గదుల కేటాయింపులో టీటీడీ చాలా ఇంపార్టెంట్ మార్పులు తీసుకొచ్చింది. ఇప్పుడు సామాన్య భక్తులు చాలా ఈజీగా, ఎక్కువ సేపు wait చేయాల్సిన అవసరం లేకుండా రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. ఈ కొత్త విధానం పూర్తిగా టెక్నాలజీ బేస్డ్ గా ఉండడం ఒక బిగ్ అడ్వాంటేజ్. ముందుగా ఏదో ఒక చోట లైన్లో నిలబడాల్సిన టైమ్ పోయింది, ఇప్పుడంతా ఆటోమేటెడ్ సిస్టమ్ మీద నడుస్తుంది.

Tirumala Rooms New Booking System

సీఆర్వో ఆఫీస్ అనేది ఈ మొత్తం ప్రాసెస్ కి సెంట్రల్ పాయింట్ గా మారింది. రూమ్ కావాలనుకునే ప్రతి ఒక్కరూ తిరుమల వచ్చిన వెంటనే ఈ ఆఫీస్ కి వెళ్లాలి. ఇక్కడ మీ ఒరిజినల్ ఆధార్ కార్డ్, ఫోన్ నంబర్ ఇచ్చి ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా మీ డీటెయిల్స్ రిజిస్టర్ చేసుకోవాలి. డైలీ మార్నింగ్ 5 గంటల నుండి అవైలబిలిటీ ఉన్నంత వరకు ఈ సేవ ఉంటుంది. రిజిస్ట్రేషన్ టైమ్ లోనే మీకు ఏ కేటగిరీ రూమ్ కావాలో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సక్సెస్ ఫుల్ గా ఎంటర్ అయ్యాక, ఒక అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ లాంటిది ఇస్తారు.

తర్వాత మీ వంతు ఎప్పుడొస్తుందా అని యాక్సియస్ గా ఉండాలి. ఇక్కడ మీరు ఏ పని చేయాల్సిన అవసరం లేదు, ఆఫీస్ దగ్గర పెట్టిన డిజిటల్ డిస్‌ప్లే బోర్డ్ మీద మీ నంబర్ ఫ్లాష్ అవుతుందో లేదో చూస్తూ ఉండాలి. మీ నంబర్ కనిపించిన 15 మినిట్స్ లోపు మీ రిజిస్టర్డ్ మొబైల్ కి ఒక SMS వస్తుంది. ఆ మెసేజ్ లో మీకు అలాట్ అయిన రూమ్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్, ఏ కౌంటర్ కి వెళ్లాలి అనే ఇన్ఫో అంతా ఉంటుంది. పాత పద్ధతిలో ఎదురు చూసే టెన్షన్ ఇప్పుడు పూర్తిగా తీసేశారు.

ఆ తర్వాత మీరు చేయాల్సిందల్లా ఆ SMS లో చెప్పిన పార్టికులర్ సబ్ ఎంక్వయిరీ ఆఫీస్ కి వెళ్లడమే. అక్కడ మీ రూమ్ రెంట్ పేమెంట్ చేయాలి, కానీ గుర్తుంచుకోండి కేవలం ఆన్‌లైన్ పేమెంట్ మాత్రమే అక్సెప్ట్ చేస్తారు. నగదు ఇవ్వడానికి వీలు లేదు. పేమెంట్ డన్ అయిన వెంటనే వాళ్ళు మీకు రూమ్ కీస్ ఇస్తారు. ఇక్కడ కొన్ని రూల్స్ కూడా మారాయి. రూమ్ కావాలంటే భక్తుడి వయసు 21 ఏళ్లు పైనే ఉండాలి. సింగిల్ పర్సన్స్ మరియు అవివాహితులకు రూమ్స్ కేటాయించరు. అలాగే, ఒకసారి రూమ్ తీసుకున్న వ్యక్తి, మళ్ళీ 30 రోజుల లోపు ఇంకో రూమ్ బుక్ చేసుకోలేరు.

Share your love