Rashmika: రష్మికపై ట్రోల్స్.. అసలు నువ్వు మనిషివేనా..కనీసం ఆ పని చేయలేవా అంటూ.!

 Trolls on Rashmika

Rashmika: పాన్ ఇండియా హీరోయిన్ గా ప్రస్తుతం అన్ని భాషల్లో సినిమాలు చేస్తున్న రష్మికకి ఇండస్ట్రీలో ఎంత పాపులారిటీ వచ్చినా కూడా ఎక్కడో ఒక దగ్గర ఈమెకు మైనస్ అవుతుంది. ఇంత పెద్ద స్టార్ హీరోయినైనా సరే ప్రతిసారి ఈమెను సొంత రాష్ట్రం వాళ్లే ఏకిపారేస్తూ ఉంటారు.దానికి కారణం ఆమె సొంత రాష్ట్రాన్ని సినిమాల్ని పట్టించుకోకపోవడమే. ఇక రష్మిక కన్నడ భాషా ద్వారానే ఇండస్ట్రీకి వచ్చింది.

Trolls on Rashmika

కానీ అలాంటిది కన్నడ భాషను మర్చిపోయి ఎక్కువగా తెలుగు, తమిళ,హిందీ సినిమాల్లోనే చేస్తుంది.అయినా ఈ విషయం పక్కన పెడితే కన్నడ మూవీ కాంతార విడుదలై దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటే కనీసం సొంత భాష నుండి హిట్ అయినటువంటి కాంతార చాప్టర్ వన్ సినిమాకి రష్మిక ఒక్క పోస్ట్ కూడా పెట్టకపోవడం నిజంగా తప్పే అంటున్నారు చాలామంది నెటిజన్స్. అంతేకాదు కన్నడ వాళ్లు అయితే రష్మికపై చాలా మండిపడుతున్నారు.అసలు నువ్వు మనిషివేనా.. ( Rashmika)

Also Read: Vijay Deverakonda: ఆ హీరోయిన్ వల్ల విజయ్ దేవరకొండకు శని పట్టుకుంది.. అందుకే యాక్సిడెంట్.!

కనీసం కాంతార చాప్టర్ వన్ సినిమా అంతపెద్ద హిట్ అయితే స్పందించలేవా.. అంతా బిజీగా ఉన్నావా.. ఒక్కొ క్షణం సినిమా గురించి పోస్ట్ చేయలేవా అంటూ మండిపడుతున్నారు. అంతేకాదు ప్రస్తుతం రష్మికకు సంబంధించి ఈ విషయాన్ని పెద్ద ఎత్తున పోస్టుల రూపంలో వైరల్ చేస్తున్నారు..మరీ అంత అహంకారం పనికిరాదు.. ఎక్కడినుండి వచ్చావో ఆ మూలాలు మర్చిపోకు అంటూ రష్మిక పై దారుణమైన పోస్టులు పెడుతున్నారు. అయితే కాంతార సినిమా విడుదలైన సమయంలో కూడా ఇదే ట్రోలింగ్ ని ఎదుర్కొంది రష్మిక.ఆ తర్వాత ఈ విషయం గురించి క్లారిటీ ఇచ్చి..

 Trolls on Rashmika

కాంతార సినిమా విడుదలైన రోజే నేను ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంటే కాంతార సినిమా చూశారా అని అడిగారు.దానికి నేను చూడలేదని ఆన్సర్ ఇచ్చినందుకు పెద్ద రాద్ధాంతం చేశారు. కానీ ఆ తర్వాత నేను సినిమా చూసి బాగుందని పోస్ట్ కూడా పెట్టాను అంటూ క్లారిటీ ఇచ్చింది. మరి తాజాగా వచ్చిన కాంతార చాప్టర్ 1 సినిమా విషయంలోనూ రష్మిక అదే ట్రోలింగ్ ని ఎదుర్కొంటుంది.మరి దీనిపై ఏ విధంగా క్లారిటీ ఇస్తుందో చూడాలి.( Rashmika)

https://twitter.com/KollyCensor/status/1975215946425078040
Share your love