Rashmika: అన్నీ ఆన్లైన్ లో పెట్టాలా.. ఆ విషయంపై ఫైర్ అయిన రష్మిక.!

Rashmika is furious about that
Rashmika is furious about that

Rashmika: చాలామంది హీరోయిన్లు ఏదైనా ఇంటర్వ్యూలో పాల్గొంటే చాలా సరదాగా మాట్లాడుతూ ఎన్నో ఫన్నీ విషయాలను షేర్ చేసుకుంటారు.తమ లైఫ్ కి సంబంధించిన సినిమాలకు సంబంధించిన ఎన్నో విషయాలు బయట పెడుతూ ఉంటారు. కానీ అప్పుడప్పుడు కొన్నిసార్లు తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి కూడా కోపంగా రియాక్ట్ అవుతారు.అలా తాజాగా హీరోయిన్ రష్మిక మందన్నా కూడా అలాగే స్పందించింది.

Rashmika is furious about that

అన్ని ఆన్లైన్లో పెట్టాలా.. నా ఇష్టం అన్నట్లుగా రష్మిక మాట్లాడిన తీరు చాలామందిని ఆశ్చర్యపరిచింది. మరి రష్మిక ఇలా స్పందించింది అనేది చూస్తే అన్ని ఆన్లైన్లో పెట్టాలా అని రష్మిక మాట్లాడిన మాటలకి చాలామంది ఆమె ఎంగేజ్మెంట్ గురించే అనుకుంటారు. ఎంగేజ్మెంట్ గురించి గత కొద్దిరోజుల నుండి వార్తలు వినిపిస్తున్న వేళ దీని గురించి రష్మిక స్పందించకపోవడంతో ఈ విధంగా పరోక్ష వ్యాఖ్యలు చేసిందని కొంతమంది అనుకుంటారు. కానీ రష్మిక కామెంట్స్ ఎంగేజ్మెంట్ గురించి అయితే కాదు.(Rashmika)

Also Read: Rashmika: రష్మికపై ట్రోల్స్.. అసలు నువ్వు మనిషివేనా..కనీసం ఆ పని చేయలేవా అంటూ.!

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చాలా మంది నన్ను కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేసిందని రూమర్లు క్రియేట్ చేస్తున్నారు. కానీ నన్ను ఏ ఇండస్ట్రీ కూడా బ్యాన్ చేయలేదు. అదంతా ఫేక్ ప్రచారం మాత్రమే. తెర వెనుక ఏం జరుగుతుంది అనేది ప్రపంచానికి తెలియదు.నేను కాంతార మూవీ టీం కి విష్ చేశాను.అయినా ప్రతి విషయాన్ని నేను ఆన్లైన్లో పెట్టే వ్యక్తిని కాదు.. అలాగే నా వ్యక్తిగత జీవితం గురించి ఎవరు ఏమనుకున్నా అస్సలు పట్టించుకోను. కేవలం నా నటన గురించి ఏం మాట్లాడుతున్నారు..

Rashmika is furious about that

ఎలాంటి కామెంట్లు చేస్తున్నారు అనేది మాత్రమే నేను పట్టించుకుంటాను.అదే నాకు ముఖ్యం.. అంటూ తాజాగా థామా మూవీ ప్రమోషన్స్ లో ఈ విషయాన్ని బయట పెట్టింది.అయితే 2022లో విడుదలైన కాంతార సినిమా విడుదలైన టైంలో రష్మిక కాంతార సినిమా గురించి స్పందించలేదని ట్రోల్స్ వచ్చాయి. ఇక తాజాగా విడుదలైన కాంతార చాప్టర్ 1 గురించి రష్మిక సోషల్ మీడియా వేదికగా కాంతార చాప్టర్ 1 సినిమాపై స్పందించలేదనే ఆరోపణలు వస్తున్న తరుణంలో రష్మిక ఈ విధంగా క్లారిటీ ఇచ్చింది.(Rashmika)

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu