Know the Signs and Protect Yourself from This New Scam

Scam: ప్రస్తుతం ఆన్లైన్ వచ్చిన తర్వాత పనులు సులభతరం అయినప్పటికీ కూడా మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి . ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దెబ్బకి పనులు సులభం అవడం ఏమో కానీ కొత్త మోసాలు మాత్రం ప్రజలను పెడుతున్నాయని చెప్పాలి. ఈ క్రమంలోనే తాజాగా ప్రపంచవ్యాప్తంగా కొత్త ఏఐ వాయిస్ స్కాం అనేది ప్రజలను వణికిస్తోందని చెప్పవచ్చు. అంతేకాదు ఈ స్కామ్ దెబ్బకి అమాయక ప్రజల అకౌంట్లు కూడా మొత్తం ఆవిరి అయిపోతున్నాయి.

సాధారణ ఓటీపీ స్కామ్ లకు ఏఐ వాయిస్ స్కామ్ లకు చాలా తేడా ఉంటుంది. ముఖ్యంగా ఓటీపీ స్కాం కోసం చాలా ప్రాసెస్ ఉంటుంది. అయితే ఈ కొత్త స్కాం కోసం ఒక కాల్ అయితే సరిపోతుందని చెప్పవచ్చు. అంతేకాదు ఈ కొత్త స్కామ్ తో మీరే స్వయంగా మీ అకౌంట్ నుండి డబ్బును పంపించేలా హ్యాకర్లు మిమ్మల్ని మోసం చేస్తారు. అందుకే ఈ కొత్త స్కాం పైన అందరికీ అవగాహన కల్పించడం తప్పనిసరి. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి మోసం చేయడం అనేది బాగా పెరిగిపోయింది. ఇతర దేశాలలో బంధువులను కలిగి ఉన్న వారిని ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఎంచుకున్న వారిని టార్గెట్ చేసిన తర్వాత ఏఐ వాయిస్ ని ఉపయోగించి వారి బంధువులు లేదా తెలిసిన వారి వాయిస్ లాగే వాయిస్ ను క్రియేట్ చేసి కాల్ చేస్తూ ఉంటారు.

Know the Signs and Protect Yourself from This New Scam

అనుకోకుండా ఇబ్బందుల్లో ఉన్నాము.. ఎమర్జెన్సీ.. అవసరము అయ్యింది.. డబ్బులు కావాలి అంటూ అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేయాలంటూ కోరుతారు.. అలా వాయిస్ కాల్ లో వినపడే వాయిస్.. వారికి తెలిసిన వారిదే కాబట్టి కోరిన అకౌంటుకు డబ్బులు పంపిస్తూ ఉంటారు. అయితే అలా ఆ కాల్ అందుకున్న వారు అసలు జరిగిన మోసం తెలిసిన తర్వాత లబోదిబో అంటున్నారు. ఇప్పటికే చాలా మోసాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా కెనడా, ఇజ్రాయిల్ లో నివసిస్తున్న వారి ఫ్యామిలీలను టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: Lost Mobile: ఈ చిన్న సెట్టింగ్ ఆన్ చేస్తే.. పోగొట్టుకున్న మొబైల్ కనుక్కోవచ్చు..!!

కాబట్టి ఆర్థిక లావాదేవీల కోసం ఏవైనా కాల్స్ వచ్చినప్పుడు.. పూర్తిగా నిజాలు తెలుసుకోకుండా తొందరపడి ఎవరికీ మీరు డబ్బులు పంపించకండి. పూర్తి నిర్ధారణ అయిన తర్వాతనే డబ్బులు పంపించడం ఉత్తమమైన పని. (Scam)

Join WhatsApp