వైసీపీ నేత, మాజీ మంత్రి వివేకా నందరెడ్డి హత్య కేసులో ఆయన కూతురు డాక్టర్ నర్రెడ్డి సునీత వేసిన పిటిషన్‌ను నాంపల్లి CBI కోర్టు కొట్టేసింది. ఈ వివేకా హత్య కేసు విచారణ చాలా కాలంగా సాగుతుండటంతో ఇక సాగదీయడం సరికాదని కోర్టు స్పష్టం చేసింది. అయినా సునీత మాత్రం తన తండ్రికి న్యాయం జరిగేవరకు తన పోరాటం ఆపనని చెప్పేసింది.
Viveka Haty Case Update
ఈ ఘటన ఇప్పటికే చాలా మలుపులు తిరిగింది. 2019 మార్చిలో పులివెందులలో వివేకా తన ఇంట్లో దారుణంగా హత్యకు గురయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో CBI ఈ కేసును దర్యాప్తు చేసింది. వందల సాక్షులను విచారించి, గత ఏడాది చార్జిషీట్ కూడా వేసింది. కానీ అనుమానితులందరినీ లోతుగా విచారించలేదని, కొన్ని ఫోన్‌లను పరిశీలించలేదని సునీత కోర్టుకు చెప్పారు.
CBI మాత్రం తాము అనుమానితులందరినీ సమగ్రంగా విచారించామని, వారికి వివేకా హత్యకు సంబంధం లేదని చెప్పింది. ఇదే విషయాన్ని మరో అఫిడవిట్ ద్వారా కోర్టుకు తెలిపింది. దీంతో నాంపల్లి కోర్టు సునీత పిటిషన్‌ను కొట్టేసింది. కోర్టు నిర్ణయం విని సునీత తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
ఇప్పుడు సునీత తదుపరి సుప్రీంకోర్టుకు వెళ్లనుంది. ఈ కేసులో న్యాయం దొరికేదెప్పుడా అనే ప్రశ్న మరోసారి తలెత్తింది. నిందితులు ఎవరు, వారికి శిక్ష ఎప్పుడు పడుతుంది అనే విషయంలో కోర్టు తీర్పు కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఆమె పోరు కొనసాగుతుంది.





