రజినీకాంత్ కూలీ సినిమా హృతిక్ రోషన్ వార్ 2 ఒకే రోజున థియేటర్స్ లోకి వస్తున్నాయి. రేపు ఈ మూవీస్ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఒక ఎమోషనల్ ట్వీట్ చేశారు హృతిక్ రోషన్. రజినీకాంత్ భగవాన్ దాదా సినిమాలో తాను చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన ఫొటోను షేర్ చేశారు. రజినీతో తను కలిసి నటించిన పిక్ ను షేర్ చేశారు హృతిక్
ఈ ట్వీట్ లో హృతిక్ స్పందిస్తూ – మీ పక్కన నటుడిగా నా తొలి అడుగులు వేశాను. మీరు నా మొదటి గురువులలో ఒకరు, రజినీకాంత్ సార్, మీరు నాకు ఎప్పుడూ ఆదర్శం అవ్వాలి, 50 సంవత్సరాల ఆన్-స్క్రీన్ మ్యాజిక్ పూర్తి చేసుకున్నందుకు అభినందనలు. అని తన ట్వీట్ లో పేర్కొన్నారు. హృతిక్ రోషన్ చేసిన ఈ ట్వీట్ నెటిజన్స్ దృష్టిని ఆకట్టుకుంటోంది.





