

Akhanda 2: నందమూరి బాలయ్య లేటెస్ట్గా నటించిన సినిమా అఖండ 2. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ కానుంది. రేపు ప్రీమియర్లు పడిపోనున్నాయి. ఇలాంటి నేపథ్యంలో అఖండ 2 సినిమాకు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. టికెట్ల ధరలు పెంచుకోమని సినిమా బృందానికి పర్మిషన్స్ ఇచ్చింది కూటమి సర్కార్. Akhanda 2
Akhanda 2 Gets Hikes In AP, What about Nizam
దీంతో అఖండ 2 సినిమా ప్రీమియర్ షోలకు 600 రూపాయలు టికెట్ ధర పెరగనుంది. అటు సింగిల్ స్క్రీన్లలో 75 రూపాయల వరకు పెంచుకోవచ్చు. మల్టీప్లెక్స్ లలో 100 రూపాయల వరకు టికెట్ల ధరలు పెరగనున్నాయి. అయితే టికెట్ల ధరలు పెంచడంపై సోషల్ మీడియాలో నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమా టికెట్ల ధరలు పెంచడంపై తాజాగా సిపిఐ నారాయణ స్పందించారు. అఖండ సినిమా టికెట్ల ధరలు ఎందుకు పెంచారని నిలదీశారు. Akhanda 2
Also Read: PM MODI: భారత పౌరులకు బిగ్ షాక్..ప్రధాని మోదీ అతిపెద్ద కుట్ర..?
ఇలా టికెట్ల ధరలు పెంచడం వల్ల ఐ బొమ్మ రవి లాంటి వాళ్లు పుట్టుకు వస్తున్నారని మండిపడ్డారు. హాయ్ బొమ్మ లాంటి వాళ్లను అరెస్టు చేసే నైతిక హక్కు ఈ ప్రభుత్వాలకు లేదని నిప్పులు చెరిగారు. సినిమా టికెట్ల ధరలు పెంచి ప్రజలపై భారం వేసి సంపన్న వర్గాలకు ఊడిగం చేస్తూ సామాన్య ప్రజలను దోచుకుంటున్నారని నిప్పులు చెరిగారు సిపిఐ నారాయణ. దీంతో అఖండ 2 సినిమా టికెట్ల ధరలు పెంచడంపై సామాజిక వర్గాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ సినిమాను బై కాట్ చేయాలని అంటున్నారు. Akhanda 2
Also Read: Komatireddy Venkat Reddy: సినిమాటోగ్రఫీ మంత్రిగా చెబుతున్నా..పవన్ కళ్యాణ్ సినిమాలు తెలంగాణలో ఆడవు







