
TDP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ కూటమిలో భారతీయ జనతా పార్టీ, జనసేన తో పాటు తెలుగుదేశం పార్టీలు ఉన్నాయి. అయితే ఈ కూటమి ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు కిందిస్థాయి లీడర్లు అసంతృప్తి గానే ఉన్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు అలాగే బీజేపీ నేతలు కలిసికట్టుగా కనిపించినప్పటికీ కింది స్థాయి లీడర్లు కలవడం లేదు. TDP
TDP protests against Vajpayee statue being installed in Bandar
తాజాగా బందర్ లో ఈ విషయం మరోసారి బయటపడింది. బందర్ ప్రాంతంలో వాజ్ పేయి విగ్రహం పెట్టకూడదని తెలుగుదేశం పార్టీ కొత్త పంచాయతీకి తెరలేపింది. బిజెపి నేతల శంకుస్థాపనను తెలుగుదేశం పార్టీ నేతలు నిరసన తెలుపుతూ అడ్డుకున్నారు. అంతే కాదు ఎన్టీఆర్ విగ్రహాన్ని పట్టుకొని రచ్చ రచ్చ చేశారు. వాజ్ పేయి విగ్రహం పెట్టకూడదని నల్ల రిబ్బన్లతో టిడిపి పార్టీ నిరసన కూడా చేసింది. TDP
Also Read: Congress: చక్రం తిప్పిన షర్మిల..తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కల్వకుంట్ల కవిత ?
దానికి భారతీయ జనతా పార్టీలు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఎన్టీఆర్ సర్కిల్ గా రికార్డులో ఉన్న ప్రాంతంలో వాజ్ పేయి విగ్రహం పెట్టడం అన్యాయం అంటూ టిడిపి మండిపడుతోంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ వర్సెస్ భారతీయ జనతా పార్టీ నేతల మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. మరి దీనిపై కూటమి అగ్ర నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. TDP
Also Read: Vijayasai Reddy: బీజేపీ పార్టీలోకి విజయసాయిరెడ్డి ? ఇదిగో షాకింగ్ పోస్ట్ !





