CM Revanth Reddy: యూరియా బ‌స్తాల‌కు రూ.2 కోట్లు గిఫ్ట్ ఇచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ?

CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత ఉన్న నేపథ్యంలో… కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే… యూరియా కోసం రెండు కోట్ల రూపాయలు ఇచ్చారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి… ఈ రెండు కోట్ల రూపాయలను యూరియా కోసం అందించారు. తన నియోజకవర్గం లోని లక్ష మంది రైతులకు… ఒక్కో రైతుకు ఒక బస్తా చొప్పున యూరియాను అందజేయాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.

Also Read: Komatireddy Raj Gopal Reddy: నేపాల్ త‌ర‌హాలోనే తెలంగాణ ప్ర‌భుత్వం కూల్చే ప్ర‌మాదం ?

MLA Bathula Lakshma Reddy presented a cheque of Rs. 2 crore to CM Revanth Reddy

ఇందులో భాగంగానే రెండు కోట్ల రూపాయల చెక్కును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందించారు మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి. ఇటీవల తన కుమారుడి వివాహం జరిగిందని… ఆ పెళ్లికి సంబంధించిన రిసెప్షన్ రద్దు చేసుకొని…. ఆ డబ్బులు రైతుల కోసం ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు లక్ష్మారెడ్డి.

Also Read: Nela Usiri: నేల ఉసిరి మొక్క గురించి మీకు తెలుసా..? ఇది తింటే 100…

ఇది ఇలా ఉండగా రెండు రోజుల కిందట ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి… గన్మెన్… ఏకంగా లోడ్ యూరియా బస్తాలు… తరలించుకు వెళ్లారట. అయితే ఈ సంఘటన జరిగిన రెండు రోజుల తర్వాత…. రెండు కోట్ల రూపాయలను అందించారు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి.

Also Read: Koushik Reddy: కొంపముంచిన ఉపరాష్ట్రపతి ఎన్నికలు.. అమ్ముడుపోయిన ఎనిమిది మంది ఎంపీలు?

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu

PakkaFilmy Telugu తెలుగు రాష్ట్రాల్లో సినిమా, రాజకీయాలు మరియు ట్రెండింగ్ వార్తలను అందించే ఒక డిజిటల్ న్యూస్ డెస్క్. మా ఎడిటోరియల్ టీమ్ ప్రతిరోజూ అందుబాటులో ఉన్న సోర్సుల నుండి సమాచారాన్ని సేకరించి, తెలుగు పాఠకుల కోసం సులభమైన భాషలో వార్తలుగా అందిస్తుంది. మమ్మల్ని ఇక్కడ కూడా ఫాలో అవ్వండి — X (Twitter): https://x.com/pakkafilmy007 | Telegram: https://t.me/pakkafilmytelugu | Instagram: https://instagram.com/pakkafilmy_