
Jubilee Hills bypoll: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉపఎన్నిక హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక నవంబర్ 11వ తేదీ జరగనుంది. నవంబర్ 14వ తేదీన ఈ ఉప ఎన్నిక ఫలితం వెలువడనుంది. అయితే ఈ ఉప ఎన్నికల్లో అన్ని పార్టీలు రసవత్తరంగా ప్రచారాన్ని చేస్తున్నాయి. Jubilee Hills bypoll
Case registered against Jubilee Hills bypoll Maganti Sunitha
ఒక్కరోజు కూడా గ్యాప్ తీసుకోకుండా ప్రచారం చేస్తున్నాయి పార్టీలు. కేటీఆర్ ముందుండి గులాబీ పార్టీని ముందుకు తీసుకువెళ్తున్నారు. అటు కాంగ్రెస్ పార్టీ తరఫున సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగుతున్నారు. అయితే బిజెపి పార్టీ మాత్రమే ఈ ఎన్నికల నేపథ్యంలో సైలెంట్ అయింది. ఇలాంటి నేపథ్యంలో గులాబీ పార్టీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. గులాబీ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభ్యర్థి మాగంటి సునీతపై బోరబండ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. Jubilee Hills bypoll
Also Read: Azharuddin: అజారుద్దీన్ కు మంత్రి పదవి..4 గురు కాంగ్రెస్ నాయకుల తిరుగుబాటు ?
గులాబీ పార్టీ గుర్తు ఉండే ఓటర్ స్లిప్పులను ఆ పార్టీ శ్రేణులు పంపిణీ చేస్తున్నానని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎన్నికల సంఘ రిటర్నింగ్ అధికారి సాయి రామ్ కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మాగంటి సునీతపై కేసు నమోదు చేయాలని పోలీస్ స్టేషన్ కు వెళ్లారు రిటర్నింగ్ అధికారి. దీంతో బోరబండ పోలీస్ స్టేషన్ లో మాగంటి సునీత పై కేసు నమోదు అయింది. Jubilee Hills bypoll
Also Read: Fenugreek Seeds: మెంతులు అని తీసిపారేస్తున్నారా..నీటిలో వేసుకొని తాగితే ?




















