Manchu Lakshmi: మంచు లక్ష్మి విడాకులు.. కలిసి ఉండడం ఇష్టం లేకే ఇండియాకి వచ్చా..!

Manchu Lakshmi: మంచు లక్ష్మి తాజా ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.. కలిసి ఉండి గొడవ పడడం ఇష్టం లేకే ఇండియాకి వచ్చేసాను అంటూ

Manchu Lakshmi divorce

Manchu Lakshmi: మంచు లక్ష్మి తాజా ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.. కలిసి ఉండి గొడవ పడడం ఇష్టం లేకే ఇండియాకి వచ్చేసాను అంటూ మంచు లక్ష్మి మాట్లాడిన మాటలు మీడియాలో దుమారం రేపుతున్నాయి.అయితే కొంతమంది నెటిజన్స్ మంచు లక్ష్మి విడాకులు తీసుకుంటుంది అంటూ దుమారం సృష్టించే కామెంట్లు చేస్తున్నారు.అయితే మంచు లక్ష్మి ఆ ఇంటర్వ్యూ లో ఏం మాట్లాడింది అనేది చూస్తే..

Manchu Lakshmi divorce

నేను పెళ్లి కాకముందు మా అమ్మ ఎలా చెప్తే అలా వినేదాన్ని.. ఎందుకంటే మా నాన్న చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు.కాలేజ్ వెళ్లే టైంలో కూడా మా అమ్మ కొనిచ్చిన బట్టలే వేసుకునే దాన్ని.అమ్మ తలనిండా నూనె పెట్టి జడ వేసి పంపించేది. అలాగే వెళ్ళేదాన్ని..ఇక పెళ్లయ్యాక కొద్ది రోజులు అమెరికాలోనే సెటిల్ అయిపోయాను.కానీ ఎప్పుడైతే కూతురు పుట్టిందో అప్పుడే తిరిగి ఇండియాకి వచ్చాను. ఆ సమయంలో నా భర్త కూడా నాతోనే వచ్చారు. కానీ ఇండియాలో ఆయన సెట్ కాలేకపోయారు. అందుకే మీ ఇష్టం ఉన్నప్పుడు అమెరికాకు రండి.. (Manchu Lakshmi)

Also Read: Manchu Lakshmi: మనోజ్ విష్ణు గొడవలు.. సర్వనాశనం అవుతారు అంటూ మంచు లక్ష్మి శాపనార్థాలు..!

నేను మాత్రం ఇక్కడ అడ్జస్ట్ కాలేకపోతున్నాను అని అమెరికాకు వెళ్ళిపోయారు. అయితే ఆయన ఇష్టాన్ని నేను కూడా కాదనలేకపోయాను.ఎందుకంటే ఎవరికి నచ్చింది వారు చేయాలి కదా.. అలాగే మాకు టైం దొరికినప్పుడల్లా అమెరికా వెళుతూ ఉంటాం. ఇక కలిసి ఉండి గొడవలు పడే కన్నా ఇలా దూరంగా ఉండి ప్రేమగా ఉండడం బెటర్ అని నాకు అనిపించింది. అలాగే మా ఆయనకి నా మీద ఎంత కోపం ఉన్నా సరే కూతురు ముందు ఒక్క మాట కూడా అనరు.ఏ గొడవ ఉన్నా సరే కూతురు బయటికి వెళ్లాకనే దాని గురించి మాట్లాడతారు అంటూ మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది.

Manchu Lakshmi divorce

అయితే మంచు లక్ష్మి మాటలు విన్న కొంతమంది నెటిజన్స్ దగ్గర ఉండి గొడవలు పడే కన్నా అంటే మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవలు వచ్చాయా.. అందుకే విడివిడిగా ఒకరు అమెరికాలో మరొకరు ఇండియాలో ఉంటున్నారా.. విడాకులకు ఏమైనా ప్రిపేర్ అవుతున్నారా ఏంటి అంటూ నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు. అయితే విడాకుల గురించి లక్ష్మి ఎక్కడా కూడా మాట్లాడలేదు.. ఇక ఇదే ఇంటర్వ్యూలో తన తమ్ముళ్ల మధ్య మరిన్ని గొడవలు సృష్టించే గాసిప్ రాయుళ్లపై ఫేక్ థంబ్ నెయిల్స్ క్రియేట్ చేసే వారిపై మండిపడుతూ మా ఇంట్లో ఉన్న గొడవలపై ఫేక్ వార్తలు క్రియేట్ చేసేవారు సర్వనాశనం అయిపోతారు అంటూ మండి పడింది.(Manchu Lakshmi)