Jubilee Hills Bypoll: కేసీఆర్ సంచ‌ల‌న ప్రెస్ మీట్‌..ఇక కాంగ్రెస్ కు డిపాజిట్లు కూడా క‌ష్ట‌మేనా?

Jubilee Hills Bypoll: తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హడావిడి కొనసాగుతోంది. మరో ఐదు రోజుల్లోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. నవంబర్ 11వ తేదీన ఈ ఉప ఎన్నిక జరగనుండగా 14వ తేదీన ఫలితం వస్తుంది. అయితే ఈ ఉప ఎన్నికల్లో చాలా సర్వే రిపోర్టులు బయటకు వచ్చాయి. ఈ రిపోర్టుల్లో గులాబీ పార్టీ విజయకేతనం ఎగరవేయనుందని స్పష్టమైనది. కేకే సర్వే అయితే ఏకంగా 18% ఓట్ల తేడాతో గులాబీ పార్టీ విజయం సాధిస్తుందని స్పష్టం చేసింది. Jubilee Hills Bypoll

Jubilee Hills Bypoll KCRs emotional press meet

మిగిలిన సర్వే రిపోర్టులు ఐదు నుంచి 8% ఓట్ల తేడాతో గులాబీ పార్టీ విజయం సాధిస్తుందని వెల్లడించాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో ఎలాగైనా గెలవాలన్న కసితో కేసీఆర్ ముందుకు వెళ్తున్నారు. రోడ్ షో లేదా ప్రెస్ మీట్ పెట్టేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారట. భారీ బహిరంగ సభ పెట్టడానికి సమయం లేకపోవడంతో కేవలం ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఇప్పటికిప్పుడు కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై మాట్లాడితే.. సర్వే రిపోర్టులు తలకిందులు అవుతాయని అంటున్నారు. Jubilee Hills Bypoll

Also Read: Telangana Cabinet: జూబ్లీహిల్స్ ఎన్నికల తరువాత తెలంగాణ కేబినెట్ నుండి ముగ్గురు మంత్రులు ఔట్…

కెసిఆర్ ఒక్కసారి బయటకు రావాలి.. కెసిఆర్ సారే కావాలి.. రేవంత్ ను ఓడించాలి అంటూ నిత్యం జనాలు భజన చేస్తున్నట్లు సర్వేలు కూడా చెబుతున్నాయి. ఇలాంటి తరుణంలో కేసీఆర్ ఒక్క ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే గులాబీ పార్టీ లక్ష ఓట్ల తేడాతో గెలిచిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. మరి కెసిఆర్ ప్రెస్ మీట్ ఎప్పుడు పెడతారో చూడాలి. కేవలం నాలుగు రోజల సమయం మాత్రమే ఎన్నికల ప్రచారానికి ఉంది. Jubilee Hills Bypoll

Also Read: Jubilee Hills Survey: జూబ్లీహిల్స్ లో విజ‌యం వారిదే..తేల్చేసిన చాణక్య స‌ర్వే రిపోర్ట్‌