Jubilee Hills Bypoll: సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ వివేక్… కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రసారాలు ?

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హడావిడి కొనసాగుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ మంత్రి వీ6 వివేక్ మధ్య వివాదాలు కొనసాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ లో అనేక వివాదాలు కొన‌సాగుతున్న త‌రుణంలో, ఏదో కాంట్రాక్ట్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ మంత్రి వీ6 వివేక్ మధ్య గ్యాప్ పెరిగిందట. దీంతో రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలను బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారట వీ6 వివేక్. Jubilee Hills Bypoll

Jubilee Hills Bypoll CM Revanth Reddy vs Vivek

అంతేకాదు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వచ్చిన వార్తలను కూడా తన ఛాన‌ల్ లో వివేక్‌ ప్రసారం చేయిస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కేకే సర్వే రిపోర్టు బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో కాంగ్రెస్ అత్యంత దారుణంగా ఓడిపోతుందని కేకే సర్వే స్పష్టం చేసింది. అయితే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చిన రిపోర్టును ప్రసారం చేయలేదు కానీ, కేకే సర్వే ఇచ్చిన రిపోర్టును వీ6 ఛానల్ లో 20 నిమిషాల పాటు ప్రసారం చేయించారట వివేక్. Jubilee Hills Bypoll

Also Read: Telangana Cabinet: జూబ్లీహిల్స్ ఎన్నికల తరువాత తెలంగాణ కేబినెట్ నుండి ముగ్గురు మంత్రులు ఔట్…

అదే సమయంలో రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించారు. ఆ రోడ్ షో కు సంబంధించిన లైవ్ ప్రసారాలు ఇవ్వలేదు కానీ, కేకే సర్వే రిపోర్టర్ మాత్రం 20 నిమిషాలు నడిపించాడని కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. వీ6 వివేక్ పైన యాక్షన్ తీసుకోవాలని ఈ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశం బయటకు రావడంతో రేవంత్ రెడ్డి వర్సెస్ వీ6 వివేక్ మధ్య వివాదాలు పెరిగిపోయాయి అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. Jubilee Hills Bypoll

Also Read: Jubilee Hills Survey: జూబ్లీహిల్స్ లో విజ‌యం వారిదే..తేల్చేసిన చాణక్య స‌ర్వే రిపోర్ట్‌

Share your love