TV5 Murthy: రూ.10 కోట్ల బ్లాక్ మెయిల్‌.. టీవీ5 మూర్తిపై కేసు న‌మోదు?

TV5 Murthy: రెండు తెలుగు రాష్ట్రాలలో టీవీ5 మూర్తి అంటే తెలియని వారు ఉండరు. టీవీ5 ఛానల్ లో చాలా సంవత్సరాలుగా న్యూస్ యాంకర్ గా పనిచేస్తున్న మూర్తి.. పలు సినిమాల్లో నటించారు. కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. అయితే అలాంటి టీవీ5 మూర్తిపై తాజాగా కూకట్ ప‌ల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. TV5 Murthy

Police case on TV5 Murthy

తన ఫోన్ టాప్ చేసి 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నాడని తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన నటుడు ధర్మసత్య సాయి మహేష్ కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. టీవీ5 మూర్తి తన ఫోన్ టాప్ చేసి తన వ్యక్తిగత వివరాలు టెలికాస్ట్ చేస్తూ రూ. 10 కోట్లు డిమాండ్ చేస్తున్నాడని కోర్టును ఏపీ మాజీ మంత్రి కాకాని వెంకటేశ్వరరావు కుమారుడు, నటుడు ధర్మసత్య సాయి మహేష్ వెల్లడించారు. TV5 Murthy

Also Read: Telangana: రేవంత్ స‌ర్కార్ లో మ‌రో సంచ‌ల‌నం..బాంబ్ పేల్చిన మంత్రి ?

ఈ మహేష్ తో ఉన్న విభేదాల నేపథ్యంలో టీవీ5 మూర్తితో కలిసి మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు అతని భార్య గౌతమీ చౌదరి. ఈ నేపథ్యంలో తన ఫోన్ ట్యాప్ చేసి, వ్యక్తిగత విషయాలను టీవీలో టెలికాస్ట్ చేసి 10 కోట్ల రూపాయలు ఇవ్వాలని టీవీ5 మూర్తి బ్లాక్మెయిల్ చేస్తున్నాడని కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు నటుడు మహేష్. ఇక కోర్టు ఆదేశాల మేరకు ఏవన్ గా గౌతమీ చౌదరి అలాగే ఏటుగా టీవీ5 మూర్తిని చేరుస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కూకట్ ప‌ల్లి పోలీసులు. TV5 Murthy

Also Read: Jagan: జ‌గ‌న్ బిగ్ స్కెచ్‌…ఆ పార్టీలో పొత్తు, ఇక కూట‌మి చిత్తు, చిత్తే ?

Share your love