Srikanth: ఫ్రెండ్ లవర్ ని ప్రేమించిన శ్రీకాంత్..ఊహకు తెలిసి..!

Srikanth loved Friend Lover
Srikanth loved Friend Lover

Srikanth: ఏంటి శ్రీకాంత్ తన ఫ్రెండ్ ప్రేమించిన అమ్మాయిని ప్రేమించాడా..మరి ఊహ.. ఊహ పరిస్థితి ఏంటి అని ప్రతి ఒక్కరికి ఒక డౌట్ అయితే వస్తుంది. అయితే శ్రీకాంత్ ప్రేమించింది ఊహతో ప్రేమలో పడకముందు. ఇక విషయం ఏమిటంటే.. శ్రీకాంత్ కి చిన్నప్పటినుండే సినిమాలంటే విపరీతమైన పిచ్చట. అలా ఇంటర్మీడియట్ అయిపోవడంతోనే వెంటనే సినిమాల్లోకి వెళ్దామని ఇంట్లో వాళ్లకు చెప్పకుండా మద్రాస్ పారిపోయాడట. ఆ తర్వాత పలు స్టూడియోలు తిరిగినా కూడా ఎవరు అవకాశం ఇవ్వకపోవడంతో పాటు కనీసం స్టూడియో లోపలికి కూడా రానివ్వకపోవడంతో చాలా బాధపడ్డారట.

Srikanth loved Friend Lover

అదే సమయంలో శ్రీకాంత్ అక్క ఫోన్ చేసి నువ్వు ఇంట్లో నుండి వెళ్లిపోయినప్పటి నుండి అమ్మ చాలా ఏడుస్తుంది.వెంటనే ఇక్కడికి వచ్చేయ్ అని చెప్పినా కూడా శ్రీకాంత్ పట్టించుకోలేదట.మీరు అక్కడికి వస్తే మళ్లీ నన్ను ఇక్కడికి పంపివ్వరు అని అన్నారట.కానీ డిగ్రీ చదువుకో..డిగ్రీ చదువు పూర్తయ్యాక నేనే నిన్ను సినిమాల్లోకి పంపిస్తా అని పేరెంట్స్ మాట ఇవ్వడంతో మద్రాస్ నుండి తిరిగి ఇంటికి వచ్చారట.ఆ తర్వాత డిగ్రీలో జాయిన్ అయిన సమయంలో మొదటి సంవత్సరంలోనే ఓ అమ్మాయిని చూసి పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారంట.(Srikanth)

Also Read: Spirit: ప్రభాస్ “స్పిరిట్” లో స్టార్ హీరో తమ్ముడు..!

కానీ ఆ టైంలో ఆ అమ్మాయికి తన ప్రేమ విషయం చెప్పకుండా వన్ సైడ్ లవ్ చేశారట.ఆ తర్వాత శ్రీకాంత్ ఫ్రెండ్ మరొకరు వచ్చి అరేయ్ నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. నాకు ఎలాగైనా నువ్వు సాయం చేయాలి అని చెప్పడంతో శ్రీకాంత్ స్టన్ అయిపోయారట. ఇదేంటి నేను ప్రేమించిన అమ్మాయిని వీడు ప్రేమిస్తున్నాడు అని షాక్ అయిపోయి ఆ తర్వాత సర్లే ఏం చేద్దాం అని తన ప్రేమను త్యాగం చేశాడట. ఆ తర్వాత ఒకరోజు శ్రీకాంత్ ఫ్రెండ్ ఆ అమ్మాయికి ప్రపోజ్ చేస్తే ఆ అమ్మాయి వెంటనే రిజెక్ట్ చేసిందట.ఆ సమయంలో శ్రీకాంత్ చాలా సంబరపడిపోయారట.

Srikanth loved Friend Lover

కానీ తన ప్రేమ విషయాన్ని మాత్రం శ్రీకాంత్ బయటికి చెప్పలేదట. ఆ అమ్మాయికి తన ప్రేమ విషయం చెబుదామనుకునే లోపే డిగ్రీ పూర్తవ్వడంతో ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్లిపోయి చివరికి తన ప్రేమని మధ్యలోనే వదిలేశాడట అలా డిగ్రీలోనే నా ఫస్ట్ లవ్ అంటూ నటుడు శ్రీకాంత్ ప్రదీప్ హోస్ట్ గా చేసిన కొంచెం టచ్ లో ఉంటే చెప్తా అనే టాక్ షోలో ఈ విషయాన్ని బయట పెట్టారు.ఇక శ్రీకాంత్ ఫస్ట్ లవ్ తర్వాత ప్రేమించింది ఊహనే. అలా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 20 సినిమాలు చేశాక శ్రీకాంత్ కి పేరు వచ్చింది. అలా ఆమె మూవీతో ఊహతో పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమకు దారితీసి ఫైనల్ గా ఈ జంట పెళ్లి చేసుకుని ముగ్గురు పిల్లలకు పేరెంట్స్ అయ్యారు.(Srikanth)

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu