

Divvela Madhuri: ఏంటి దివ్వెల మాధురి బిగ్ బాస్ లోకి పంపకపోతే చనిపోతానని బెదిరించిందా? అందుకే దువ్వాడ శ్రీనివాస్ పంపించాల్సి వచ్చిందా.. ఇంతకీ దివ్వెల మాధురి దువ్వాడ శ్రీనివాస్ ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసిందనే దాంట్లో ఎంత నిజం ఉంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. బిగ్ బాస్ 9 ప్రస్తుతం రసవత్తరంగ సాగుతోంది. అయితే హౌస్ లో మాధూరి ఉన్నన్ని రోజులు చాలా రసవత్తరంగా ఉంది. కానీ ఆమె బయటికి వచ్చాక అంత బాలేదని చెప్పుకోవచ్చు.
Divvela Madhuri Blackmailing to Duvvada srinivas
వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి వెళ్ళిన దివ్వెల మాధురి మూడు వారాలకే తిరిగి బయటికి వచ్చేసింది. ఇక బయటికి వచ్చాక ప్రముఖ జర్నలిస్టు జాఫర్ చేసిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది.ముఖ్యంగా జర్నలిస్టులు అంటేనే ఏదో ఒక విషయం గురించి బయటికి లాగాలనే అనుకుంటారు.అలా దివ్వెల మాధురికి సంబంధించి వచ్చిన ఒక రూమర్ ని కూడా అడిగి తెలుసుకున్నారు.మీరు బిగ్ బాస్ లోకి పంపించకపోతే చస్తానని దువ్వాడ శ్రీనివాస్ ని బెదిరించారట నిజమేనా..(Divvela Madhuri)
Also Read: Gopichand: స్టార్ హీరోకి విలన్ గా గోపీచంద్.. దశ తిరుగుతుందా.?
పంపివ్వడం లేదు అని చేతును కట్ చేసుకున్నారట కదా.. దానికి సంబంధించిన మార్క్ కూడా మీ చేతి మీద ఉంది అంటూ ప్రశ్నించారు. దానికి మాధురి అలాంటిదేమీ లేదు. అయితే హౌస్ లోకి వెళ్లడం నా భర్త వద్దన్నారు అది నిజమే. నేను ఒప్పుకుంటాను. అలాగే బిగ్ బాస్ నుండి నాకు ఎన్నోసార్లు ఫోన్ కాల్స్ వచ్చాయి. కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసాను.ఆ తర్వాత శ్రీను గారు ఒప్పుకున్నాకే నేను హౌస్ లోకి వెళ్ళాను.

అంతేగాని నేను చేతు కోసుకున్నాను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశాను అనేవి అన్నీ రూమర్స్ మాత్రమే. అలాగే నా చేతి మీద ఉన్న మార్కు కూడా నేను చేతు కోసుకుంటే అయిన మచ్చ కాదు.నాకు ఇంజ్యూరీ వల్ల అయిన మచ్చ. అవన్నీ ఫేక్ న్యూస్.. బిగ్ బాస్ కోసం చేతు కోసుకోవాల్సిన అవసరం నాకు లేదు అంటూ పిచ్చ క్లారిటీ ఇచ్చింది.(Divvela Madhuri)







