సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు ఓ మధ్య తరగతి కుటుంబం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది అనే కథాంశంతో రూపొందిన సినిమా 3 బీహెచ్ కే. సిద్ధార్థ్, శరత్ కుమార్, దేవయాని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తమిళంలో జూన్ లో రిలీజై తెలుగులో జూలై 4న ప్రేక్షకుల ముందుకొచ్చింది. థియేట్రికల్ గా 3 బీహెచ్ కే సినిమా పెద్దగా ప్రభావం చూపించకున్నా ఓ మంచి ప్రయత్నంగా పేరు తెచ్చుకుంది.
ఇప్పుడీ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. అమోజాన్ ప్రైమ్ వీడియోలో 3 బీహెచ్ కే సినిమా నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. తమిళ్, తెలుగులో ఈ సినిమా అందుబాటులో ఉంది. 3 బీహెచ్ కే చిత్రాన్ని శాంతి టాకీస్ బ్యానర్ పై అరుణ్ విశ్వ నిర్మించగా..శ్రీ గణేష్ దర్శకత్వం వహించాడు. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రైమ్ వీడియోలో ఆదరణ పొందే అవకాశాలు ఉన్నాయి.




















