సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబో మూవీకి సంబంధించి ఒక విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. మహేష్ పుట్టినరోజున ఈ సినిమాను అధికారికంగా ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రేజీ పాన్ ఇండియా మూవీని అనౌన్స్ చేయకపోవడానికి గల కారణం ఏంటనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాని శ్రీ దుర్గా ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. అయితే పలు హాలీవుడ్ కంపెనీలతో టై అప్ అయ్యే ప్లానింగ్ జరుగుతుందట. ఇంకా ఏ హాలీవుడ్ కంపెనీలతో పార్టనర్ షిప్ కన్ ఫర్మ్ కాలేదని సమాచారం.
హాలీవుడ్ కంపెనీల పార్టనర్ షిప్ కన్ ఫర్మ్ అయితే..అప్పుడు ఈ సినిమాని అఫిషియల్ గా పెద్ద ఈవెంట్ పెట్టి అనౌన్స్ చేస్తారట. అందుకనే ఇంత ఆలస్యం జరుగుతుందని తెలిసింది. హాలీవుడ్ కంపెనీల భాగస్వామ్యంతో సినిమా చేస్తే.. ఆస్కార్ అవార్డుల విషయంలో నేరుగా పోటీపడే ఛాన్స్ ఉంటుంది. ఇదంతా చూస్తుంటే రాజమౌళి ఈసారి పెద్ద ప్లానే వేసాడని తెలుస్తుంది. ఇలా ఈ మూవీకి సంబంధించిన అప్ డేట్ రాదని తెలియడంతో మహేష్ బాబు పుట్టినరోజును అతడు రీ రిలీజ్ తో సెలబ్రేట్ చేసుకోవాలని డిసైడ్ అయ్యారని వార్తలు వస్తున్నాయి. ఎస్ఎస్ఎంబీ 29 మూవీని 2027లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. త్వరలోనే ఎస్ఎస్ఎంబీ 29 టీమ్ ఆఫ్రికా షెడ్యూల్ కు రెడీ అవుతోంది.





