“మెగా 157” ఇంకా ఖరారు కాని టైటిల్

మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ అనిల్ రావిపూడితో చేస్తున్న సినిమా మెగా 157. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ విషయంలో రెండు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. మన శంకర వరప్రసాద్ గారు, సంక్రాంతికి రఫ్పాడించేద్దాం అనే టైటిల్స్ లో ఒకటి ఈ సినిమాకు పెట్టబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ రెండింటిలో ఏదైనా ఒకటి ఖరారు చేస్తారా లేక కొత్త టైటిల్ ఏదైనా ఫిక్స్ చేస్తారా అనేది తెలియాల్సిఉంది. టైటిల్ విషయంలో ఇంకా ఫైనల్ డెసిషన్ మేకర్స్ తీసుకోలేదనే తెలుస్తోంది.

ఏమైనా ఈ నెల 22న మెగాస్టార్ చిరంజీవి బర్త్ డేకి ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఆ రోజు మెగా 157 టైటిల్ పోస్టర్ రిలీజ్ తో పాటు రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు. ఈ క్రేజీ మూవీకి భీమ్స్ అదిరిపోయే సాంగ్స్ రెడీ చేశాడట. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఎలా అయితే సాంగ్స్ బ్లాక్ బస్టర్ అయ్యాయో.. అలా ఈ సినిమాలో పాటలు కూడా ఉంటాయట. మ్యూజికల్ మెగా ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఉంటుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి.

Share your love