రజినీ డైరెక్టర్ తో మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు కమిట్ అవుతున్నాడు. వశిష్ట్ డైరెక్షన్ లో విశ్వంభర నెక్ట్స్ సమ్మర్ రిలీజ్ కు రెడీ అవుతోంది. మరోవైపు సంక్రాంతికి అనిల్ రావిపూడి డైరెక్షన్లో రూపొందుతోన్న మన శంకర్ వరప్రసాద్ గారు రాబోతోంది. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో ఓ మూవీ చేస్తున్నారు మెగాస్టార్. వీటితో పాటు ఇటీవల చిరు బర్త్ డేకు డైరెక్టర్ బాబీతో సినిమాను అనౌన్స్ చేశారు. వాల్తేరు వీరయ్యలో చిరంజీవితో పాటు రవితేజ నటించినట్టుగా ఇందులో కూడా మరో హీరో నటించబోతున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి..ఆ హీరో ఎవరు అనేది తెలియాల్సిఉంది.

ఈ ప్రాజెక్ట్స్ ఇలా ఉంటే జైలర్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తో మెగాస్టార్ ఓ సినిమాకు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ డైరెక్టర్ ప్రస్తుతం జైలర్ సీక్వెల్ జైలర్ 2 రూపొందిస్తున్నాడు. రీసెంట్ గా దిలీప్ కుమార్ మెగాస్టార్ చిరంజీవిని కలిసారని కోలీవుడ్ లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఇటీవ‌లే ఇద్ద‌రి మ‌ధ్య హైద‌రాబాద్ లో మీటింగ్ జరిగిందట. ఈ కాంబోలో సినిమా కోసమే మీటింగ్ జరిగిందని తెలుస్తోంది. ఈ మూవీ ఓకే అయితే మెగాస్టార్ కు మరో క్రేజీ ప్రాజెక్ట్ కానుంది.

Share your love