“మెగా 157” నుంచి మెగాస్టార్ బర్త్ డే ట్రీట్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా మెగా 157. ఈ చిత్రాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందిస్తున్నారు. మెగా 157 గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెలుస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ తో పాటు సినిమా రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేసేందుకు మూవీ టీమ్ రెడీ అవుతున్నారు. చిరంజీవి బర్త్ డే అయిన ఈ నెల 22న టైటిల్ అనౌన్స్ చేస్తూ రిలీజ్ డేట్ కూడా ప్రకటించనున్నారు.

ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు తేదీ కూడా రివీల్ చేయాలని అనుకుంటున్నారు మేకర్స్. చిరంజీవి మరో సినిమా విశ్వంభర నుంచి కూడా బర్త్ డే స్పెషల్ అప్డేట్ ఉండబోతోంది. ఈ సినిమా షూటింగ్ ను రీసెంట్ గా కంప్లీట్ చేశారు మెగాస్టార్. బాబీ దర్శకత్వంలో ఆయన నటించే సినిమాకు సంబంధించిన అనౌన్స్ మెంట్ కూడా బర్త్ డే సందర్భంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి.