“అఖండ 2” రిలీజ్ ప్లాన్ మారింది

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతున్న అఖండ 2 సినిమాను సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తున్నట్టుగా ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇప్పుడు అఖండ 2 రిలీజ్ ప్లాన్ మారిందనే టాక్ వినిపిస్తోంది. సెప్టెంబర్ 25న అఖండ 2 తో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ ఓజీ మూవీ రిలీజ్ అవుతుండడం…పైగా అఖండ 2 అప్పటికి కొంత వర్క్ కూడా పెండింగ్ ఉంటుండడంతో హడావిడిగా కంప్లీట్ చేసి రిలీజ్ చేయడం కంటే..కాస్త టైమ్ తీసుకునే రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట.

అందుకనే అఖండ 2 రిలీజ్ డేట్ మారిందని సమాచారం. డిసెంబర్ 5న అఖండ 2 రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట. అఖండ సినిమా కూడా డిసెంబర్ లోనే రిలీజ్ అయ్యింది. ఇప్పుడు అఖండ 2 కూడా డిసెంబర్ లోనే రిలీజ్ అయితే.. సెంటిమెంట్ పరంగా కూడా వర్కవుట్ అవుతుందని నమ్మకంతో ఉన్నారట. ప్రస్తుతం రిలీజ్ డేట్ విషయమై ఆలోచిస్తున్నారట. అంతా కన్ ఫర్మ్ అయిన తర్వాత అఫిషియల్ గా అనౌన్స్ చేస్తారని తెలిసింది.

Share your love