“కూలీ”తో పాటు వస్తోన్న “OG”

రజినీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్..క్రేజీ కాంబోలో రూపొందిన భారీ పాన్ ఇండియా మూవీ కూలీ. ఈనెల 14న కూలీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. కూలీతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ ఓజీ కూడా రాబోతోందని టాక్ వినిపిస్తోంది. ఓజీ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. సెప్టెంబర్ 25న ఓజీ మూవీని భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఓజీ మూవీ గ్లింప్స్ ను కూలీ సినిమాతో పాటు రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట. కూలీ మూవీకి ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. అందుకనే.. కూలీ రిలీజైన థియేటర్స్ లో ఓజీ సినిమా గ్లింప్స్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారని తెలిసింది. ఓజీ రిలీజ్ డేట్ కు ఇంకా టైమ్ ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే పక్కా ప్లానింగ్ తో ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఓజీ నుంచి సాంగ్ రిలీజ్ చేశారు. అలాగే కూలీతో గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నారు. అలాగే పవర్ స్టార్ కూడా వీరమల్లుకు చేసినట్టుగానే ప్రమోషన్స్ చేయడానికి ఓకే చెప్పారని తెలిసింది.

Share your love