సూపర్ స్టార్ మహేశ్ బాబు బర్త్ డే సందర్భంగా ఆయన హీరోగా నటిస్తున్న ఎస్ఎస్ఎంబీ 29 నుంచి అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా నుంచి ఫస్ట్ పోస్టర్ ను ఈ రోజు విడుదల చేశారు. ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ అఫీషియల్ అప్డేట్ ఇదే. నవంబర్ లో ఈ సినిమా గురించి చెప్తామని దర్శకుడు రాజమౌళి ట్వీట్ చేశారు. ఈ సినిమాను పరిచయం చేయడానికి పోస్టర్ లేదా ప్రెస్ మీట్ సరిపోదని, అందుకే సరికొత్తగా ఈ సినిమా గురించి ఇంట్రడక్షన్ ఇస్తామని ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు.
ఈ సినిమాను అనౌన్స్ చేసే విధానం ఇప్పటిదాకా ఎవరూ చేయని విధంగా ఉంటుందని చెప్పారు. మహేశ్ బాబు మెడలో నందీశ్వరుడు, శివుడి త్రిశూలం, బొట్టు ఉన్న లాకెట్ ఉన్న పోస్టర్ ఇంటెన్స్ గా కనిపిస్తోంది. గ్లోబ్ ట్రోటర్ అనే హ్యాష్ ట్యాగ్ ను ఈ పోస్టర్ కు జత చేశారు రాజమౌళి. ప్రస్తుతం ఎస్ఎస్ఎంబీ 29 అప్డేట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. నవంబర్ లో రానున్న ఈ అనౌన్స్ మెంట్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.





