బర్త్ డే కు కొత్త సినిమా అనౌన్స్ మెంట్

నాగార్జున ఇటీవల కూలీ చిత్రంలో విలన్ గా నటించారు. ఆయన హీరోగా సోలో సినిమా చేసి చాలా కాలమవుతోంది. ఇప్పుడా టైమ్ వచ్చినట్లు తెలుస్తోంది. నాగార్జున జగపతి బాబు చేస్తున్న స్పెషల్ ప్రొగ్రామ్ జయమ్ము నిశ్చయమ్మురాలో పాల్గొని తన వందో సినిమా వివరాలు తెలిపాడు. గత కొన్ని రోజులుగా తన 100వ సినిమా గురించి వర్క్ జరుగుతోందని, ఇదొక ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ అని నాగార్జున వెల్లడించారు.

ఈ నెల 29న తన పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీని అనౌన్స్ చేస్తామని చెప్పారు నాగార్జున. అంతే కాకుండా ఈ సినిమాని కోలీవుడ్ డైరెక్టర్ రా కార్తీక్ తెరకెక్కించనున్నట్టుగా ఈ షోలో చెప్పారు. 100వ సినిమా గురించి చాలా కథలు విని ఫైనల్ గా ఈ మూవీని ఫిక్స్ చేశారు. దీని కోసం ఫోటో షూట్ కూడా చేశారని..నాగ్ బర్త్ డేకు గ్లింప్స్ రిలీజ్ చేస్తారని తెలిసింది. ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మించనున్నారు.

Share your love