రజినీకాంత్, నాగార్జున కాంబోలో దర్శకుడు లోకేష్ కనకరాజ్ రూపొందించిన భారీ పాన్ ఇండియా మూవీ కూలీ ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాకు బుకింగ్స్ రికార్డ్ స్థాయిలో జరుగుతున్నాయి. కూలీ సినిమాతో పాటు శివ రీ రిలీజ్ కు సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. శివ సినిమాను 4కే తో పాటు డాల్బీ సౌండ్ సిస్టమ్ తో రీ రిలీజ్ కి రెడీ అవుతోంది.
తెలుగు సినిమాలో ట్రెండ్ సెట్టర్ గా చెప్పుకునే శివ సినిమా రీ రిలీజ్ కు వస్తుండటం మూవీ లవర్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. నాగార్జున కూలీ సినిమాలో సైమాన్ అనే పాత్ర పోషించాడు. ఫస్ట్ టైమ్ నాగార్జున విలన్ పాత్ర పోషించడంతో కూలీ సినిమాపై ఆసక్తి ఏర్పడుతోంది. సన్ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మించింది. బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ గెస్ట్ రోల్ చేయడం విశేషం. కూలీలో నాగార్జున విలన్ గా ఎంత వరకు మెప్పిస్తాడో చూడాలి.





