వందో సినిమా సెట్స్ మీదకు వెళ్లేది ఎప్పుడంటే

తన పుట్టినరోజున 100వ సినిమాను నాగార్జున ప్రకటిస్తారని టాక్ వినిపించింది. అయితే ఈ సినిమా అనౌన్స్ మెంట్ మాత్రం రాలేదు. నాగ్ 100వ సినిమాను కోలీవుడ్ డైరెక్టర్ కార్తీక్ తో చేయనున్నారు. ఫ్యామిలీ ఎమోషన్, సెంటిమెంట్, ఎంటర్ టైన్మెంట్, యాక్షన్ తో ఈ మూవీ ఉంటుందని నాగార్జున ఇటీవల చెప్పారు. ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మిస్తున్నారు.

నాగార్జున పుట్టినరోజు సందర్భంగా డైరెక్టర్ కార్తీక్ నాగ్ ను కలిసి మళ్లీ కథ గురించి కూడా చర్చించారు. సెప్టెంబర్ 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. మంచి ముహుర్తం చూసి నాగార్జున 100వ సినిమాను గ్రాండ్ అనౌన్స్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు నాగార్జున చేసిన పాత్రలకు పూర్తి భిన్నంగా ఇందులో పాత్ర ఉంటుందని.. నాగ్ కెరీర్ లో ఎప్పటికీ మరచిపోలేని సినిమా అవుతుందని వినిపిస్తుంది.

Share your love