పవర్ ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ పుట్టినరోజు సెప్టెంబర్ 2. ఈ పుట్టినరోజుకు పవర్ స్టార్ నుంచి ఫ్యాన్స్ కు కావాల్సిన అప్ డేట్స్ వస్తాయని ఎదురు చూస్తున్నారు. పవన్ నటిస్తున్న ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల మేకర్స్ కూడా అభిమానుల కోసం అప్డేట్స్ తో ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈసారి డబుల్ ట్రీట్ రాబోతుందని టాక్ వినిపిస్తోంది. పవర్ స్టార్ బర్త్ డేకు ఓజీ నుంచి టీజర్ లేదా మరో సాంగ్ రిలీజ్ చేస్తారని తెలుస్తోంది.

అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి కూడా ట్రీట్ రెడీ అవుతుందట. హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఈ సినిమా రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ నుంచి కూడా సెప్టెంబర్ 2న పవర్ స్టార్ బర్త్ డే సందర్భంగా సాలిడ్ అప్డేట్ ఇస్తారని టాక్ వినిపిస్తోంది.

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu