
New GST rates: సెప్టెంబర్ 22 నుంచి దేశవ్యాప్తంగా కొత్త GST rates అమల్లోకి రానున్నాయి. ఈ మార్పుల వల్ల సాధారణ వినియోగదారులు ఎలా లాభపడతారు? అనేది పెద్ద చర్చగా మారింది. సరుకులపై ఉన్న MRP (Maximum Retail Price) తక్షణమే మారదు కాబట్టి, ప్రజలు గందరగోళానికి గురవుతారని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అందుకే clarity ఇవ్వడానికి కొన్ని కీలక guidelines విడుదల చేసింది.
New GST rates effective September 22
కొత్త నిబంధనల ప్రకారం, ఒకే వస్తువుపై రెండు MRPలు కనిపించే అవకాశం ఉంది. ఒకటి పాత ధర, మరొకటి కొత్త ధర. ఉదాహరణకు ప్యాక్ చేసిన వస్తువులు (packed goods) ఎక్కువగా పాత MRPతో ఉంటాయి కానీ కొత్త GST slabs వల్ల తగ్గిన ధర కూడా చూపబడుతుంది. వినియోగదారులు ఎప్పుడూ కొత్త MRPనే అనుసరించి కొనుగోలు చేయాలి. దీంతో ప్రజలకు తక్షణమే tax benefit అందుతుంది.
కేంద్రం స్పష్టంగా తెలిపిన ప్రకారం, పాత స్టాక్ సరుకులు (old stock) అయినప్పటికీ వాటిని కొత్త GST rates ప్రకారమే అమ్మాలి. పాత ధర పక్కనే కొత్త MRPని sticker లేదా stamp రూపంలో ముద్రించాలి. కానీ పాత ధరను పూర్తిగా మూసివేయడం తప్పు. ఒక వస్తువుపై పాత ధర కంటే కొత్తది తక్కువగా ఉందని కస్టమర్లు సులభంగా compare చేసుకోగలిగేలా ఉంచాలనే ఉద్దేశంతో ఈ ఆదేశాలు జారీ చేశారు.
ఇక transparency కోసం, ఉత్పత్తిదారులు, ప్యాకర్లు, దిగుమతిదారులు కనీసం రెండు సార్లు ఒక newspaperలో ప్రకటనలు ఇవ్వాలి. అలాగే legal metrology controllersకి కూడా సమాచారం అందించాలి. ఈ నిబంధనలు డిసెంబర్ 31 వరకు లేదా పాత stock పూర్తయ్యే వరకు అమల్లో ఉంటాయి. కేంద్ర ఆర్థిక మంత్రి Nirmala Sitharaman ప్రజలకు ఈ ప్రయోజనం చేరడానికి తాను స్వయంగా పర్యవేక్షిస్తానని ప్రకటించారు.
