Shrasti Verma: శ్రష్టి వర్మపై పగబట్టిన పొలిటికల్ పార్టీ .. కావాలనే ఎలిమినేట్ చేయించారా.?

Political party that has a grudge against Shrasti Verma

Shrasti Verma: బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అయ్యి ఇప్పటికే వారం ముగిసింది.అలాగే ఒకరు ఎలిమినేట్ అయ్యి హౌస్ నుండి బయటకు వచ్చేసారు. అయితే ఈసారి బిగ్ బాస్ సీజన్ 9 లోకి కామనర్స్ గా అయిదుగురు వెళ్ళిన సంగతి మనకు తెలిసిందే.అలాంటిది కామనర్స్ గా వెళ్లిన వాళ్లు ఎలిమినేట్ కాకుండా సెలబ్రిటీ ఎలిమినేట్ అవ్వడంతో చాలామంది షాక్ అయిపోయారు.అది కూడా సోషల్ మీడియా,మెయిన్ మీడియాలో ఎక్కువ ఫేమస్ అయిన కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ..

Political party that has a grudge against Shrasti Verma

చివరి వరకు ఉంటుంది అనుకున్న శ్రష్టి వర్మ ఇలా మొదటి వారానికే ఎలిమినేట్ అవ్వడంతో చాలామంది చాలా రకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కొంతమంది నెటిజన్స్ అయితే అసలు శ్రష్టి వర్మ ఎలిమినేట్ కావాల్సింది కాదని,కానీ కొంతమంది పని గట్టుకొని మరీ ఆమె ఎలిమినేషన్ కి కారణమయ్యారు అంటూ రూమర్లు స్ప్రెడ్ చేస్తున్నారు. (Shrasti Verma)

Also Read: Kriti Shetty: తమిళ హీరోతో ప్రేమలో పడ్డ కృతి శెట్టి..!

అయితే శ్రష్టి వర్మ ఆ మధ్యకాలంలో జానీ మాస్టర్ మీద లైంగిక ఆరోపణల కేసు పెట్టి సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో హాట్ టాపిక్ నిలిచిన సంగతి మనకు తెలిసిందే. ఈ విషయంలో జానీ మాస్టర్ జైలు జీవితం కూడా గడిపివచ్చారు. అలా తాజాగా బిగ్ బాస్ సీజన్ 9 లోకి వచ్చిన శ్రష్టి వర్మపై జనసేన పార్టీలో కీలకంగా ఉన్న జానీ మాస్టర్ అభిమానులు కార్యకర్తలు పనిగట్టుకొని మరీ నామినేషన్స్ లో ఉన్న మిగతా వారందరికీ ఓట్లు వేసి శ్రష్టి వర్మకు తక్కువ ఓట్లు పడేలా చేశారని ఒక రూమర్ వైరల్ అవుతుంది.

Political party that has a grudge against Shrasti Verma

అంతేకాదు శ్రష్టి వర్మ ఎలిమినేషన్ లో జానీ మాస్టర్ అభిమానులు అలాగే జనసేన కార్యకర్తల హస్తం ఉంది అంటూ రూమర్లు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ చివరి వరకు ఉంటుందనుకున్న శ్రష్టి వర్మ ఎలిమినేట్ అయ్యి రెండు లక్షల రెమ్యూనరేషన్ తో బయటికి వచ్చింది.(Shrasti Verma)

Share your love