Rajinikanth: టాప్ హీరోయిన్స్ గాసిప్స్.. ఇళయరాజా చీకటి కోణాన్ని బయటపెట్టిన రజినీకాంత్.?

Rajinikanth reveals the dark side of Ilayaraja

Rajinikanth: సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది బయటికి ఒకలా లోపల మరోలా ఉంటారు. అయితే వారికి సంబంధించిన చీకటి కోణాలు బయటపడే వరకు అందరూ మంచివారి లాగే కనిపిస్తారు.కానీ ఒక్కసారి బయటపడితే వారి గురించి ఎన్నో తెలియని విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతుంటాయి. అలా తాజాగా సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి ఇళయరాజా కి సంబంధించిన కొన్ని సీక్రెట్ విషయాలు రజినీకాంత్ బయట పెట్టడంతో ఈ విషయం తెలిసిన చాలా మంది నెటిజన్లు ఇళయరాజా ఇలాంటివారా అంటూ షాక్ అయిపోతున్నారు.

Rajinikanth reveals the dark side of Ilayaraja

మరి ఇంతకీ ఇళయరాజా కి సంబంధించిన సీక్రెట్ విషయాలు రజినీకాంత్ ఏం బయటపెట్టారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇళయరాజా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 50 సంవత్సరాలవుతుంది.ఈ నేపథ్యంలోనే తమిళనాడు ప్రభుత్వం ఈయనని ఘనంగా సన్మానించింది.అయితే దీనికోసం ఒక పెద్ద సన్మాన సభ అరేంజ్ చేసి ఎంతోమంది ప్రముఖులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించింది.ఇందులో భాగంగా రజినీకాంత్ కమలహాసన్ లు కూడా వచ్చారు. అయితే ఈ కార్యక్రమానికి వచ్చిన రజినీకాంత్ ఇళయరాజా లో ఎవరికి తెలియని కోణాన్ని బయటపెట్టారు. (Rajinikanth)

Also Read: Shrasti Verma: శ్రష్టి వర్మపై పగబట్టిన పొలిటికల్ పార్టీ .. కావాలనే ఎలిమినేట్ చేయించారా.?

మేము ఆరోజు జానీ మూవీ షూటింగ్ సమయంలో రాత్రి మందు పార్టీ పెట్టుకున్నాం.ఆ పార్టీకి ఇళయరాజాని కూడా ఆహ్వానించాం. అయితే ఆ రోజు ఇళయరాజాలో బయటికి కనిపించని కోణాన్ని చూశాను.ఎందుకంటే సగం బీర్ బాటిల్ తాగి ఇళయరాజా తెల్లవారుజామున 3 గంటల వరకు డాన్స్ చేయడం చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను.అంతేకాకుండా నెక్స్ట్ సినిమాకి మ్యూజిక్ అందించమని మహేంద్రన్ అడిగితే ఆయన మాత్రం మ్యూజిక్ విషయం చెప్పకుండా సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోయిన్ల కి సంబంధించి రూమర్లను, గాసిప్ విషయాలను బయటకు చెప్పడంతో మేమిద్దరం ఆశ్చర్యపోయాం.

Rajinikanth reveals the dark side of Ilayaraja

ఇదేంటి ఈయనలో ఇలాంటి కోణం కూడా ఉందా అని షాక్ అయ్యాం..అంటూ రజినీకాంత్ చెప్పారు.ఇక రజినీకాంత్ ఇళయరాజా కి సంబంధించి చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్లు ఇళయరాజాలో ఇలాంటి కోణం కూడా ఉందా.. ఆయన చూడ్డానికి అహంకారి లా కనిపిస్తారు కానీ ఆయనతో ఉన్నవారికి మాత్రమే ఆయనేంటో పూర్తిగా అర్థమవుతుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.అలా రజినీకాంత్ కి ఇళయరాజా తో ఉన్న అనుబంధాన్ని ఆ కార్యక్రమంలో బయటపెట్టారు.(Rajinikanth)

Share your love