Teja Sajja: తేజసజ్జాతో పాన్ వరల్డ్ మూవీ.. రాజమౌళిని మించిన స్క్రిప్ట్.!

Pan World movie with Teja Sajja

Teja Sajja: హను-మాన్, మిరాయ్ రెండు సినిమాలతో తేజ సజ్జా రేంజ్ పెరిగిపోయింది. హను-మాన్ మూవీ పాన్ ఇండియా మూవీగా విడుదలై బ్లాక్బస్టర్ హిట్ కొట్టింది. ఆ తర్వాత వచ్చిన మిరాయ్ మూవీ కూడా సంచలన హిట్ కొట్టడంతో చాలామంది నెటిజన్లు తేజ ని పొగుడుతున్నారు. అంతేకాదు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా కేవలం చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి మళ్లీ ఇన్ని సంవత్సరాల తర్వాత హీరోగా అరంగేట్రం చేసి సోలోగా సక్సెస్ కొట్టడం నిజంగా గ్రేట్ అంటూ తేజ సజ్జా ని తెగ పొగడుతున్నారు.

Pan World movie with Teja Sajja

ఎందుకంటే ఇప్పుడున్న కొంతమంది హీరోలు బ్యాగ్రౌండ్ ఉన్నా కూడా తేజ సజ్జా లాంటి హిట్స్ కొట్టడం లేదు. అలాంటిది ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే తేజ సజ్జా హీరోగా ఎదగడం పట్ల చాలామంది అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.అయితే తాజాగా మిరాయ్ విడుదలైన సందర్భంగా నిర్మాత అందరూ ఆశ్చర్యపోయే విషయాన్ని అనౌన్స్ చేశారు. (Teja Sajja)

Also Read: Mokshagna: మోక్షజ్ఞ అదృష్టాన్ని ఆ హీరో లాగేసుకున్నాడా.. తెర వెనుక ఏం జరిగిందంటే.?

అదేంటంటే తేజ సజ్జా తో పాన్ వరల్డ్ మూవీ చేయబోతున్నారట. మరి ఇంతకీ ఆ నిర్మాత ఎవరు..తేజ సజ్జా చేయబోయే ఆ పాన్ వరల్డ్ మూవీ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. తేజ ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో జాంబిరెడ్డి సినిమా వచ్చిన సంగతి మనకు తెలిసిందే. కరోనా టైం లో వచ్చిన జాంబిరెడ్డి సినిమా ఎంతోమందిని ఆకట్టుకుంది.

Pan World movie with Teja Sajja

అయితే ఈ సినిమాకి సీక్వెల్ గా జాంబీరెడ్డి -2 పాన్ వరల్డ్ లెవెల్ లో రాబోతుంది అంటూ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తాజాగా బిగ్ బాస్ సీజన్ 9 షోలో పాల్గొని బయ పెట్టారు. అలాగే పాన్ వరల్డ్ లెవెల్ లో అద్భుతమైన విజువల్స్ తో జాంబిరెడ్డి 2 మూవీని అతి త్వరలో షూటింగ్ స్టార్ట్ చేస్తాం అంటూ నిర్మాత ప్రకటించడంతో చాలామంది తేజ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.(Teja Sajja)

Share your love