OG Movie: “ఓజి” కోసం మిరాయ్ కి అన్యాయం.. థియేటర్లు లాగేసుకున్నారు ?

mirai theatre belongs to og movie

OG Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం “ఓజి”.ఈ సినిమా మరికొద్ది గంటల్లోనే అంటే సెప్టెంబర్ 25వ తేదీన రేపు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. అయితే ప్రస్తుతం థియేటర్లు ఖాళీ లేకపోవడంతో పవన్ కళ్యాణ్ అభిమానులకు, చిత్ర బృందానికి బిగ్ షాక్ తగిలింది. తాజాగా తేజ సబ్జా హీరోగా నటించిన మిరాయ్ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుంది. ఈ సినిమా భారీగా కలెక్షన్లు రాబడుతోంది. మిరాయ్ సినిమాను దాదాపు అన్ని థియేటర్లలో విడుదల చేశారు. థియేటర్లు ప్రస్తుతం ఖాళీ లేవు. మిరాయ్ సినిమా సెప్టెంబర్ 12వ తేదీన రిలీజ్ అయ్యి ఫుల్ జోరు కనబరుస్తోంది. OG Movie

mirai theatre belongs to og movie

చాలా చోట్ల ఇప్పటికే థియేటర్లు అన్ని హౌస్ ఫుల్ గా నడుస్తున్నాయి. ఇప్పుడు ఓజి సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో… మిరాయ్ సినిమా నడుస్తున్న అన్ని థియేటర్ స్క్రీన్లను ఓజి సినిమాకు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఓజి సినిమా విడుదలైన రోజున థియేటర్లను ఓజి సినిమాకు కేటాయించి మళ్లీ శుక్రవారం నుంచి యధావిధిగా మిరాయ్ సినిమాను ప్రదర్శించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. కాగా ఇప్పటికే మిరాయ్ సినిమా 150 కోట్ల కలెక్షన్ల దిశగా ప్రయాణిస్తుంది. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ మీద గౌరవంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. OG

Also Read: 13-year-old Afghan boy: విమానం బొక్కల్లో దూరి ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఢిల్లీకి వచ్చిన కుర్రాడు

కాగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజి సినిమా కోసం తన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు పోటిగా మిరాయ్ సినిమా ఉందని కొంతమంది అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కు పోటి ఉండద్దని నిర్ణయంతో మిరాయ్ మూవీ టీం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో మిరాయ్ మూవీ యూనిట్ పై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా ఓజి సినిమా థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. అభిమానులు మాత్రం ఎన్నో రోజుల నుంచి పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారి అంచనాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఈ సినిమాను ఎంతో అద్భుతంగా చిత్రీకరించారు. మరి ఓజి సినిమా మరికాసేపట్లో విడుదలై ఏ విధంగా రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

Also Read: Ambati Rambabu: OG సినిమా బంపర్ హిట్.. అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు !

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu