Mirai update: శ్రీరాముడిగా రానా.. రవితేజ, దుల్కర్ లు కూడా.. ‘మిరాయ్’ లో భారీ సర్ప్రైజ్ లు!!

Mirai update: యాక్షన్-అడ్వెంచర్ సూపర్ హీరో మూవీగా తెరకెక్కుతున్న మిరాయ్ (Mirai) సెప్టెంబర్ 12, 2025న ప్రపంచవ్యాప్తంగా 8 భాషల్లో (languages) గ్రాండ్‌గా విడుదల కానుంది. హీరోగా తేజ సజ్జా నటిస్తున్న ఈ పాన్-ఇండియా సినిమా ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ చేసుకుంది. తాజాగా ఒక సెన్సేషనల్ అప్‌డేట్ బయటకు రావడంతో అభిమానుల్లో హైప్ మరింత పెరిగింది.

Teja Sajja superhero film Mirai update

ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, రానా దగ్గుబాటి (Rana Daggubati) ఈ సినిమాలో శ్రీరాముడి పాత్రలో కనిపించనున్నారు. ఈ శక్తివంతమైన పాత్ర మిరాయ్‌లో హైలైట్ కానుందని మేకర్స్ భావిస్తున్నారు. ఇటీవల ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో తేజ సజ్జా మాట్లాడుతూ, సినిమాలో యాక్షన్, అడ్వెంచర్‌తో పాటు భక్తి కూడా ఉంటుందని, అలాగే రెండు surprise cameo roles ఉన్నాయని హింట్ ఇచ్చారు.

విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఆ సర్ ప్రైజ్ క్యామియోలలో రవితేజ (Ravi Teja), దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) ఉన్నారని తెలుస్తోంది. ఈ ఇద్దరు స్పెషల్ రోల్స్‌లో కనిపించి ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేయనున్నారు. అయితే, ఈ విషయం గురించి అడిగినప్పుడు తేజ సజ్జా స్పందించకుండా మౌనం వహించడం ఆసక్తిని మరింత పెంచింది.

కార్తిక్ ఘట్టమనేని (Karthik Ghattamaneni) దర్శకత్వం వహించిన మిరాయ్ సినిమా, అద్భుతమైన visuals మరియు ఆధునిక టెక్నాలజీతో తెరకెక్కింది. దుబాయ్ కాకుండా అమెరికాలో ప్రత్యేక స్క్రీనింగ్స్ చేయనున్నట్లు టీమ్ అధికారికంగా ప్రకటించింది. రానా శ్రీరాముడిగా, రవితేజ, దుల్కర్ సల్మాన్ స్పెషల్ రోల్స్‌లో నటించనున్నారని వార్తలు బయటకు రావడంతో మిరాయ్ సినిమాపై ప్రేక్షకుల ఆసక్తి టాప్ గేర్‌లోకి చేరింది.

Share your love