
OG Trailer: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా మూవీ ఓజి.. ఈ సినిమా మరో రెండు రోజుల్లో విడుదల కాబోతుండడంతో సినిమాకి ఇప్పటికే భారీ హైప్ వచ్చేసింది. అలాగే తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ మాస్ ఎంట్రీ ఇచ్చారు. ఓజి మూవీ లో వాడిన కత్తిని పట్టుకొని ఆయన ఇచ్చిన మాస్ ఎంట్రీ కి అభిమానులు ఈలలు వేస్తూ పూనకం వచ్చిన వారిలా ఊగిపోయారు. అయితే నిన్ననే ట్రైలర్ విడుదల ఇవ్వాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల ట్రైలర్ ఈరోజు విడుదలైంది.
Pawan disaster movie has become trending with the OG Trailer
అయితే తాజాగా విడుదలైన ట్రైలర్లో పవన్ కళ్యాణ్ తన మాస్ స్టైలిష్ లుక్స్ తో అభినులని కట్టిపడేశారు. ఇక ట్రైలర్ చూసిన నెటిజన్లు ట్రైలరే ఇలా ఉంటే సినిమా ఎలా ఉంటుందో అంటూ ఊహించుకుంటున్నారు.అయితే తాజాగా విడుదలైన ఓజి ట్రైలర్ తో పవన్ కళ్యాణ్ డిజాస్టర్ మూవీ ని గుర్తు చేసుకుంటున్నారు ఆయన అభిమానులు. ఇక ఆ సినిమా ఏంటయ్యా అంటే పంజా.. పవన్ కళ్యాణ్ సినీ కెరియర్ లో అట్టర్ ప్లాఫ్ మూవీలలో పంజా మూవీ ఒకటి. (OG Trailer)
Also Read: OG Movie: దర్శకుడు సుజీత్‌పై పవన్ కళ్యాణ్ ఫైర్…స్టేజి పైనే ?
అయితే ఈ సినిమా కథ అద్భుతంగా ఉంటుంది.కానీ సినిమా ఎందుకు హిట్ అవ్వలేదు ఆ దేవుడికే ఎరుక. అయితే ఈ సినిమా విడుదలయ్యాక ఈ సినిమాపై ట్రోల్స్, మీమ్స్ ఎంతలా వైరల్ అయ్యాయో చెప్పనక్కర్లేదు.అయితే తాజాగా ఓజి మూవీ ట్రైలర్ తో పవన్ కళ్యాణ్ డిజాస్టర్ పంజా మూవీ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఓ జీ మూవీ లో గ్యాంగ్ స్టర్ గా గన్ పట్టుకొని ఎలా అయితే కనిపించారో గతంలో వచ్చిన పంజా మూవీ లో కూడా ఆయన గన్ పట్టుకొని అలాగే ఉంటారు.

అయితే ఈ ట్రైలర్ చూసిన నెటిజన్స్ పవన్ కళ్యాణ్ పంజా మూవీని తెగ గుర్తు చేసుకుంటున్నారు. అయితే గతంలో పంజా మూవీ చూసిన చాలామంది పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గ సినిమా ఇది కాదు అని ట్రోల్స్ చేశారు.కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ సమయంలో ఓజీ మూవీ ఆయన కెరీర్ కి మరింత ప్లస్ అవుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అంటున్నారు ట్రైలర్ చూసిన అభిమానులు.(OG Trailer)





